లాక్‌డౌన్‌కు మించి.. మహారాష్ట్రలో కర్ఫ్యూ విధింపు.. సీఎం ఉద్ధవ్ ప్రకటన

ఇప్పటికే అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేయగా.. తాజాగా జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

news18-telugu
Updated: March 23, 2020, 5:41 PM IST
లాక్‌డౌన్‌కు మించి.. మహారాష్ట్రలో కర్ఫ్యూ విధింపు.. సీఎం ఉద్ధవ్ ప్రకటన
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే
  • Share this:
జనతా కర్ఫ్యూని సీరియస్‌గా తీసుకున్న ప్రజలు.. లాక్‌డౌన్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్‌డౌన్‌కు మించి కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ ప్రకటించగా.. మహారాష్ట్ర సర్కార్ కూడా అదే బాటలో నడిచింది. మహారాష్ట్రలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాన్ని అష్ట దిగ్బంధనం చేస్తున్నారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేయగా.. తాజాగా జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కర్ఫ్యూ విధించినప్పటికీ అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు, బేకరీలు, మెడికల్ షాపులు తెరచుకునే ఉంటాయని.. ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలను ఇప్పటికే వేశారు. ఐతే ఆలయం లోపల నిత్య పూజలు, ప్రార్థనలు కొనసాగనున్నాయి.


First published: March 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading