కరోనా కల్లోలం.. 36వేల మంది మృతులు.. 7 లక్షలకు పైగా కేసులు

మరణాల్లో ఇటలీ (11,591) టాప్ ప్లేస్‌లో ఉండగా.. స్పెయిన్ (7,340) రెండో స్థానంలో ఉంది. చైనాలో 3304 మంది చనిపోగా.. అమెరికాలో 2613 మంది మరణించారు.

news18-telugu
Updated: March 31, 2020, 7:16 PM IST
కరోనా కల్లోలం.. 36వేల మంది మృతులు.. 7 లక్షలకు పైగా కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. యూరప్‌‌తో పాటు అమెరికాలో కోవిడ్-19 మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా ధాటికి అక్కడ జనం పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటి వరకు 199 దేశాలకు కరోనా మహమ్మారి.. సోమవారం రాత్రి నాటికి 36,207 మందిని బలితీసుకుంది. ఇప్పటి వరకు 7.52 లక్షల మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 1,58,697 మంది కోలుకున్నారు. కరోనా బాధితుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఇటలీ, స్పెయిన్ కొనసాగుతున్నాయి. కోవిడ్-19 పుట్టిన చైనా మాత్రం నాలుగో స్థానంలో ఉంది. మరణాల్లో ఇటలీ (11,591) టాప్ ప్లేస్‌లో ఉండగా.. స్పెయిన్ (7,340) రెండో స్థానంలో ఉంది. చైనాలో 3304 మంది చనిపోగా.. అమెరికాలో 2613 మంది మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు-మరణాలు దేశాల వారీగా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు (Image:worldometers)




First published: March 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading