Coronavirus Effect: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్

Coronavirus Effect | దేశమంతా కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో పాలసీ హోల్డర్లకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఊరటనిచ్చింది.

news18-telugu
Updated: March 23, 2020, 10:58 AM IST
Coronavirus Effect: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్
Coronavirus Effect: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC పాలసీ ఉందా? మీరు మార్చి 31 లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉందా? మీలాంటి పాలసీ హోల్డర్లకు ఎల్ఐసీ ఊరట కల్పించింది. ప్రీమియం చెల్లించాలన్న హడావుడితో కరోనా వైరస్ బారినపడకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ప్రీమియం చెల్లించాల్సి ఉంటే గడువు లోగా చెల్లించలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి 2020 ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించింది ఎల్ఐసీ. మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరి రోజు. పన్ను మినహాయింపులు పొందేందుకు చాలామంది మార్చిలో ఎల్ఐసీ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా వారి పాలసీ ప్రీమియం చెల్లించడానికి మార్చి 31 వరకు ప్రీమియం ఉంటుంది.


ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఉండటం, అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఉండటంతో ఎల్ఐసీ గడువు పొడిగించింది. ప్రీమియం చెల్లించాలని ఎల్ఐసీ కార్యాలయాలకు పాలసీ హోల్డర్లు వస్తే రద్దీ పెరుగుతుందని భావించిన కంపెనీ... ఇన్స్యూరేన్స్ ప్రీమియం గడువు పొడిగించింది. ఎల్ఐసీ కార్యాలయాల్లో ప్రీమియం చెల్లించలేనివారు ఆన్‌లైన్‌లో పాలసీ ప్రీమియం చెల్లిచడం సులువే. నెట్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలో ప్రీమియం చెల్లించొచ్చు.

ఇవి కూడా చదవండి:

IRCTC: రైలు టికెట్ బుక్ చేసినవారికి ఊరట... ఈ రూల్స్ మారాయి

Coronavirus: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఇలా చేయమంటున్న ఈపీఎఫ్ఓ

Reliance Jio: గుడ్ న్యూస్... జియో యూజర్లకు డబుల్ డేటా
Published by: Santhosh Kumar S
First published: March 23, 2020, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading