Coronavirus: స్మార్ట్‌ఫోన్‌పై కరోనావైరస్ ఎన్ని రోజులు ఉంటుందంటే

Coronavirus: స్మార్ట్‌ఫోన్‌పై కరోనావైరస్ ఎన్ని రోజులు ఉంటుందంటే (ప్రతీకాత్మక చిత్రం)

Coronavirus on Smartphone | మీ స్మార్ట్‌ఫోన్‌పై కరోనా వైరస్ ఎంతసేపు ఉంటుందో తెలుసా? ఈ విషయం తెలిస్తే మీరు స్మార్ట్‌ఫోన్ వదిలేసినా ఆశ్చర్యం లేదు.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో కలకలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో ఇళ్లకే పరిమితం కావడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చు. ఈ జాగ్రత్తలు మాత్రమే సరిపోవు. కరోనావైరస్ వ్యాప్తిపై మరింత అవగాహన తప్పనిసరి. అసలు కరోనా వైరస్ ఏఏ వస్తువులపై ఎంత సేపు ఉంటుందో తెలుసుకోవడం మంచిది. స్మార్ట్‌ఫోన్లపైనా కరోనా వైరస్ రోజుల తరబడి ఉంటుందన్న విషయం తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. తాజాగా ఓ అధ్యయనం ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

    స్మార్ట్‌ఫోన్ ఈ రోజుల్లో అందరి జీవితంలో భాగమైపోయింది. రోజులో కొన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతుంటారు. అన్ని వస్తువులపై కరోనా వైరస్ చేసినట్టు స్మార్ట్‌ఫోన్‌ పైనా ఉంటుంది. వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-WHO అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ (SARS-CoV) ను మొదటిసారి 2003లో గుర్తించారు. ఆ వైరస్ గ్లాస్ సర్ఫేస్‌పైన 96 గంటల వరకు అంటే నాలుగు రోజులు ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌, ప్లాస్టిక్‌ పైన 72 గంటలు అంటే మూడు రోజులు ఉంటుంది.

    ఇప్పుడు నావెల్ కరోనా వైరస్ (SARS-CoV-2) ఏఏ వస్తువులపై ఎంత సేపు ఉంటుందని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయనం జరిపింది. స్టెయిన్‌లెస్ స్టీల్ పైన మూడు రోజులు, కాపర్‌పైన నాలుగు గంటలు, కార్డ్‌బోర్డ్ పైన 24 గంటలు ఉంటుందని తేలింది. అయితే గ్లాస్‌పైన ఎంత సేపు ఉంటుందన్నది తేలలేదు. అయితే గతంలో జరిపిన అధ్యయనాలను బట్టి నావెల్ కరోనా వైరస్ గ్లాస్‌పైన నాలుగు రోజులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణలుు. అంటే స్మార్ట్‌ఫోన్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ ప్యానెల్స్‌తో తయారవుతాయి. కాబట్టి కరోనా వైరస్ స్మార్ట్‌ఫోన్లపైన నాలుగు రోజుల వరకు ఉంటుందని అంచనా.

    ఇతర వస్తువులపై కరోనా వైరస్ ఉంటే తప్పించుకోవచ్చేమో కానీ స్మార్ట్‌ఫోన్‌పైన ఉంటే మాత్రం మీకు వైరస్ సోకే ప్రమాదం చాలాచాలా ఎక్కువ. మీరు హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కున్నా, శానిటైజర్ అప్లై చేసినా వెంటనే స్మార్ట్‌ఫోన్ పట్టుకుంటారు కాబట్టి మళ్లీ రిస్క్ తప్పదు. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం మంచిది. మరి మీ స్మార్ట్‌ఫోన్ ఎలా క్లీన్ చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    JioPhone: జియోఫోన్ యూజర్లకు శుభవార్త... 10 రెట్లు లాభాలివే తెలుసుకోండి

    Work From Home: ఈ 9 టిప్స్‌తో మీ వైఫై స్పీడ్ పెంచుకోండి

    Credit Cards: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు గుడ్ న్యూస్... మారటోరియంపై ఆర్‌బీఐ క్లారిటీ
    Published by:Santhosh Kumar S
    First published: