COVID-19: మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే

Essential Medical Gadgets | ఏ అనారోగ్య సమస్య అయినా ముందే లక్షణాలు గుర్తిస్తే త్వరగా చికిత్స ప్రారంభించొచ్చు. ప్రతీ ఆరోగ్య సమస్యకు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని మెడికల్ గ్యాడ్జెట్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని గుర్తించొచ్చు. ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఏవో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 26, 2020, 12:18 PM IST
COVID-19: మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే
COVID-19: మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభంతో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏఏ ఎక్సర్‌సైజ్‌లు చేయాలన్న అంశాలపై ప్రజలు దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు పరీక్షలు జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్ని గుర్తించడానికి ఆస్పత్రికే వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని మెడికల్ గ్యాడ్జెట్స్‌ని ఇంట్లో ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని తెలుసుకోవచ్చు. మరి ఆ గ్యాడ్జెట్స్ ఏవో తెలుసుకోండి.

Weighing machine: మీరు బరువు పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం, పెరిగినట్టు మీకు అనిపించిందా? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా జరగొచ్చు. అందుకే తరచూ బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు మీరు వ్యాయామం చేస్తున్నట్టైతే అప్పుడప్పుడూ బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఇంట్లో వెయింగ్ మెషీన్ ఉంటే మంచిది. రూ.500 నుంచి రూ.5,000 మధ్య వెయింగ్ మెషీన్ ధర ఉంటుంది.

Thermometer: జ్వరం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి థర్మామీటర్ ఉపయోగపడుతుంది. శరీరం వేడిగా అనిపించినప్పుడు ఓసారి టెంపరేచర్ చెక్ చేసుకుంటే మంచిది. అసలే ఇప్పుడు కరోనా వైరస్ కాలం. అందుకే కాస్త వేడిగా అనిపిస్తే థర్మామీటర్‌తో టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో డిజిటల్ థర్మామీటర్లు కొనొచ్చు. ధర రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది. కాంటాక్ట్‌లెస్ థర్మామీటర్ అయితే రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుంది.

Blood pressure monitor: హైపర్ టెన్షన్ లాంటి సమస్యలతో ఇంట్లో ఎవరైనా ఉంటే బ్లడ్ ప్రెషర్ మానిటర్ తప్పనిసరిగా ఉండాలి. బీపీ చెక్ చేసుకొని నోట్ చేసి మీ ఫ్యామిలీ డాక్టర్‌కు వివరించొచ్చు. అప్పుడే సరైన మెడిసిన్ వాడే అవకాశం ఉంటుంది. రూ.500 నుంచి రూ.3,000 మధ్య బీపీ మెషీన్స్ లభిస్తాయి.

Glucometer: ఈ రోజుల్లో డయాబెటిస్ మామూలైపోయింది. అందుకే బ్లడ్ షుగర్ చెక్ చేయడానికి గ్లూకోమీటర్ ఉండటం మంచిది. తినడానికి ముందు తిన్న తర్వాత బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవచ్చు. గ్లూకోమీటర్ ధర రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది.

Pulse oximeter: పల్స్ రేట్ చెక్ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగపడుతుంది. కోవిడ్ 19 కారణంగా పల్స్ ఆక్సిమీటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పల్స్ ఆక్సిమీటర్ ధర రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుంది.

Nebulizer: ఇంట్లో పిల్లలు ఉన్నా, ఆస్తమా పేషెంట్లు ఉన్నా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నా నెబ్యులైజర్ ఉండటం మంచిది. ప్రతీసారి క్లినిక్‌కు వెళ్లాల్సిన అసరం లేదు. నెబ్యులైజర్ ధర రూ.1,500 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది.ఇవి కూడా చదవండి:

Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్

Lockdown: లాక్‌డౌన్‌లో బాగా నడిచిన బిజినెస్ ఇదే... వ్యాపారం చేయడానికి ప్రభుత్వ సాయం

SBI: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 10 టిప్స్ పాటించాలంటున్న ఎస్‌బీఐ
Published by: Santhosh Kumar S
First published: May 26, 2020, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading