Home /News /coronavirus-latest-news /

Indian Railways: రైలు బోగీల్లో 3,20,000 ఐసోలేషన్ బెడ్స్... తెలంగాణకు 7,776 బెడ్స్

Indian Railways: రైలు బోగీల్లో 3,20,000 ఐసోలేషన్ బెడ్స్... తెలంగాణకు 7,776 బెడ్స్

Indian Railways: రైలు బోగీల్లో 3,20,000 ఐసోలేషన్ బెడ్స్... తెలంగాణకు 7,776 బెడ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways: రైలు బోగీల్లో 3,20,000 ఐసోలేషన్ బెడ్స్... తెలంగాణకు 7,776 బెడ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | కరోనా వైరస్‌పై పోరాటానికి భారతీయ రైల్వే కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. రైలు బోగీలను ఆస్పత్రులుగా మారుస్తోంది.

    కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. కరోనా మహమ్మారి విజృంభించి ఆస్పత్రుల్లోని బెడ్స్ సరిపోని పరిస్థితి నెలకొంటే, రైళ్లనే ఆస్పత్రులుగా వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారతీయ రైల్వేకు చెందిన ఐదు జోన్లు నాన్ ఏసీ ట్రైన్ కోచ్‌ను ఆస్పత్రిగా మార్చి నమూనాలను తయారు చేసింది. ఒక కోచ్‌లో 16 మంది పేషెంట్లకు చికిత్స అందించేలా డిజైన్ చేసింది. ఇది సక్సెస్ కావడంతో మరిన్ని కోచ్‌లను ఆస్పత్రులుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 20,000 కోచ్‌లను మాడిఫై చేసి 3,20,000 ఐసోలేషన్ బెడ్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది. అత్యధిక కోచ్‌లు తెలంగాణకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని క్వారెంటైన్, ఐసోలేషన్ వార్డులుగా వాడుకోవచ్చు.

    Coronavirus Pandemic, Coronavirus Crisis, Train hospitals, Indian Railways, Coronavirus hospitals, train coach into hospital, భారతీయ రైల్వే, కరోనా వైరస్ మహమ్మారి, ట్రైన్ హాస్పిటల్, ఇండియన్ రైల్వేస్, ట్రైన్ కోచ్ ఆస్పత్రి
    ప్రతీకాత్మక చిత్రం


    భారతదేశంలో 16 రైల్వే జోన్లల్లో ఎక్కడెక్కడ ఎన్ని కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చనున్నామో రైల్వే వివరించింది. తెలంగాణలోని సికింద్రాబాద్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 486 కోచ్‌లు అంటే 7,776 ఐసోలేషన్ బెడ్స్, ముంబై హెడ్‌క్వార్టర్‌గా ఉన్న సెంట్రల్ రైల్వేకు 482 కోచ్‌లు అంటే 7712 ఐసోలేషన్ వార్డులు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే 20,000 కోచ్‌లను టార్గెట్‌గా పెట్టుకోగా ఇప్పటికే 5,000 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే పని మొదలైంది.

    Coronavirus Pandemic, Coronavirus Crisis, Train hospitals, Indian Railways, Coronavirus hospitals, train coach into hospital, భారతీయ రైల్వే, కరోనా వైరస్ మహమ్మారి, ట్రైన్ హాస్పిటల్, ఇండియన్ రైల్వేస్, ట్రైన్ కోచ్ ఆస్పత్రి
    ప్రతీకాత్మక చిత్రం


    ప్రతీ నాన్ ఏసీ కోచ్‌లో 9 కంపార్ట్‌మెంట్స్, 4 టాయిలెట్స్ ఉంటాయి. వాటిలో రెండింటిని బాత్‌రూమ్స్‌గా మార్చారు. ప్రతీ క్యాబిన్‌లో 6 బెర్తులతో 10 క్యాబిన్స్ ఉంటాయి. పేషెంట్లకు, మెడికల్ సిబ్బందికి వేర్వేరు క్యాబిన్స్ ఉంటాయి. ప్రతీ కంపార్ట్‌మెంట్‌ను అవసరమైతే ఒక క్యూబికల్‌గా మారుస్తామంటోంది రైల్వే. ఒక కంపార్ట్‌మెంట్‌ను వైద్య సిబ్బంది కోసం నర్సింగ్ స్టేషన్‌గా మారుస్తామంటోంది. చిన్నచిన్న మార్పులు చేస్తే ప్రతీ కోచ్‌లో 8 మంది పేషెంట్లకు చికిత్స అందించొచ్చని రైల్వే చెబుతోంది.

    Coronavirus Pandemic, Coronavirus Crisis, Train hospitals, Indian Railways, Coronavirus hospitals, train coach into hospital, భారతీయ రైల్వే, కరోనా వైరస్ మహమ్మారి, ట్రైన్ హాస్పిటల్, ఇండియన్ రైల్వేస్, ట్రైన్ కోచ్ ఆస్పత్రి
    ప్రతీకాత్మక చిత్రం


    పేషెంట్ క్యాబిన్ తయారు చేసేందుకు ఒకవైపు మిడిల్ బెర్త్, మరోవైపు మూడు బెర్తులు, ల్యాడర్స్ తొలగించారు. ప్రతీ క్యాబిన్‌కు ప్లాస్టిక్ కర్టైన్ ఏర్పాటు చేశారు. డాక్టర్, నర్స్, మెడికో కమ్ స్టోర్ క్యాబిన్‌లో మిడిల్ బెర్త్ తొలగించారు. ప్రతీ కంపార్ట్‌మెంట్‌కో 220 వోల్డ్ ఎలక్ట్ పాయింట్ ఉంటుంది. ఆస్పత్రిగా మారిన రైలు బోగీ ఫోటోలను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Coronavirus: స్మార్ట్‌ఫోన్‌పై కరోనావైరస్ ఎన్ని రోజులు ఉంటుందంటే

    Work From Home: ఈ 9 టిప్స్‌తో మీ వైఫై స్పీడ్ పెంచుకోండి

    Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Indian Railway, Indian Railways, Lockdown, Railways, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    తదుపరి వార్తలు