Coronavirus: అలర్ట్... అలర్ట్... ఈ వెబ్‌సైట్స్ అస్సలు ఓపెన్ చేయకండి

Alert | మీరు మెయిల్ ఓపెన్ చేసినప్పుడు అనుమానాస్పద లింక్స్ కనిపిస్తే పట్టించుకోవద్దు. వాటిని డిలిట్ చేయడం మంచిది. పొరపాటున కూడా ఎవరికీ షేర్ చేయొద్దు.

news18-telugu
Updated: March 26, 2020, 12:16 PM IST
Coronavirus: అలర్ట్... అలర్ట్... ఈ వెబ్‌సైట్స్ అస్సలు ఓపెన్ చేయకండి
Coronavirus: అలర్ట్... అలర్ట్... ఈ వెబ్‌సైట్స్ అస్సలు ఓపెన్ చేయకండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనావైరస్... ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. కరోనా వైరస్ గురించి తెలుసుకునేందుకు, ఈ వైరస్ బారినపడకుండా జాగ్రత్త పడేందుకు నెటిజన్లు గూగుల్‌లో వెతుకుతున్నారు. కరోనా వైరస్‌కు సంబంధించిన ఆర్టికల్స్ చదువుతున్నారు. కరోనా వైరస్ సమాచారంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో సైబర్ నేరగాళ్లు కూడా అదే రూట్‌లో వస్తున్నారు. ఇమెయిల్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ కౌంట్లను హ్యాక్ చేసేందుకు కరోనా వైరస్ పేరుతో వెబ్‌సైట్స్ రూపొందించి వల వేస్తున్నారు. వెబ్‌సైట్ పేరులోనే కరోనా వైరస్ అని ఉండటంతో చాలామంది అందులో కరోనా వైరస్‌కు సంబంధించి సమాచారం ఉందనుకొని క్లిక్ చేస్తున్నారు. తమ అకౌంట్లను రిస్క్‌లో పెడుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో వెబ్‌సైట్స్ పుట్టుకొచ్చాయి. అవి ఇమెయిల్స్, ఎస్ఎంఎస్, వాట్సప్‌, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వెబ్‌సైట్లను గుర్తించిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఏఏ వెబ్‌సైట్స్ క్లిక్ చేయకూడదో ఆ వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన వెబ్‌సైట్స్ ఇవే.

coronavirusstatus[.]space
coronavirus-map[.]com

blogcoronacl.canalcero[.]digital
coronavirus[.]zone


coronavirus-realtime[.]com
coronavirus[.]appbgvfr.coronavirusaware[.]xyz
coronavirusaware[.]xyz
corona-virus[.]healthcare
survivecoronavirus[.]org
vaccine-coronavirus[.]com
coronavirus[.]cc
bestcoronavirusprotect[.]tk
coronavirusupdate[.]tk


ఇవి చాలా డేంజరస్ డొమైన్స్ అని, వీటిని క్లిక్ చేయొద్దని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు. మరి మీకు కూడా ఈ వెబ్‌సైట్లతో ఏవైనా మెసేజ్‌లు వస్తే అందులోని లింక్స్ అస్సలు క్లిక్ చేయకూడదు. ఈ లింక్స్ ఎక్కువగా ఇమెయిల్స్‌లో వస్తున్నాయి. కాబట్టి మీరు మెయిల్ ఓపెన్ చేసినప్పుడు అనుమానాస్పద లింక్స్ కనిపిస్తే పట్టించుకోవద్దు. వాటిని డిలిట్ చేయడం మంచిది. పొరపాటున కూడా ఎవరికీ షేర్ చేయొద్దు.

ఇవి కూడా చదవండి:

Digital Payments: బయటకు వెళ్లలేకపోతున్నారా? పేమెంట్స్ ఇంటి నుంచే చేయండి ఇలా

Coronavirus Effect: టీవీ, స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు చూస్తున్నారా? మీకు బ్యాడ్ న్యూస్

ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు