Arogya Sanjeevani: ఆరోగ్య సంజీవని పాలసీ ప్రారంభంచిన బజాజ్ అల్లియాంజ్... బెనిఫిట్స్ ఇవే

Arogya Sanjeevani Health Insurance Policy | తక్కువ ధరకే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. కరోనావైరస్ చికిత్స కూడా కవర్ అయ్యే ఆరోగ్య సంజీవని పాలసీని బజాజ్ అల్లియాంజ్ ఇన్యూరెన్స్ కంపెనీ ప్రారంభించింది.

news18-telugu
Updated: April 8, 2020, 2:00 PM IST
Arogya Sanjeevani: ఆరోగ్య సంజీవని పాలసీ ప్రారంభంచిన బజాజ్ అల్లియాంజ్... బెనిఫిట్స్ ఇవే
Arogya Sanjeevani: ఆరోగ్య సంజీవని పాలసీ ప్రారంభంచిన బజాజ్ అల్లియాంజ్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బజాజ్ అల్లియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆరోగ్య సంజీవని పాలసీని ప్రారంభించింది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ హెల్త్ పాలసీ ఇది. ఏప్రిల్ 1న అధికారికంగా ప్రారంభమైంది. భారతదేశంలోని 29 జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ పాలసీని అందించాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. దీంతో కంపెనీలు వరుసగా ఈ పాలసీని ప్రారంభిస్తున్నారు. ఐఆర్‌డీఏఐ నుంచి అప్రూవల్ తీసుకున్న బజాజ్ అల్లియాంజ్ ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే స్టాండర్డ్ హెల్త్ పాలసీ అందించాలన్న ఉద్దేశంతో ఐఆర్‌డీఏఐ ఈ పాలసీని రూపొందించడం విశేషం. మార్కెట్‌లో చాలా హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ ఉన్నా, ఆరోగ్య సంజీవని పాలసీ మాత్రం అన్ని కంపెనీల్లో ఒకేలా ఉంటుంది.

ప్రజలు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడంలో ఆరోగ్య సంజీవని పాలసీ కీలకంగా మారుతుంది. పాలసీ బెనిఫిట్స్ అన్ని కంపెనీల్లో ఒకేలా ఉన్నా, కస్టమర్లకు అందించే సర్వీస్‌లో తేడా ఉంటుంది.

తపన్ సింఘెల్, ఎండీ, సీఈఓ, బజాజ్ అల్లియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్


ఆరోగ్య సంజీవని పాలసీ రూ.1,00,000 నుంచి రూ.5,00,000 వరకు కవరేజీతో ఉంటుంది. పాలసీ ప్రీమియం రూ.2,400 నుంచి ప్రారంభమవుతుంది. పాలసీ హోల్డర్ వయస్సు, బీమా మొత్తాన్ని బట్టి ప్రీమియం మారుతుంది. కరోనా వైరస్ చికిత్స కూడా ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ అవుతుందని ఇటీవల ప్రకటించింది ఐఆర్‌డీఏఐ. దీంతో పాటు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరోగ్య సంజీవని పాలసీ బెనిఫిట్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే

Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్ 

Online Banking Tips: ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading