ఫ్రాన్స్‌లో తిరిగి ప్రారంభమైన థియేటర్లు... సీట్ల మధ్యలో మినియన్స్ ఏర్పాటు...

కరోనా ఇప్పట్లో వదిలేలా లేదు. అలాగని ఊరుకుంటే అన్ని రంగాలూ దెబ్బతింటున్నాయి. అందుకే ఫ్రాన్స్ ప్రభుత్వం థియేటర్లను తిరిగి తెరిచేందుకు ఒప్పుకుంది.

news18-telugu
Updated: June 23, 2020, 11:05 AM IST
ఫ్రాన్స్‌లో తిరిగి ప్రారంభమైన థియేటర్లు... సీట్ల మధ్యలో మినియన్స్ ఏర్పాటు...
థియేటర్‌లో మినియన్స్ బొమ్మలు (credit - Reuters/Benoit Tessier)
  • Share this:
చాలా మంది ఊహించినట్లుగానే 2020 నిజంగానే సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇప్పటికే రెస్టారెంట్లలో సీట్ల మధ్యలో టెడ్డీ బేర్లు, ప్లాస్టిక్ బొమ్మలను పెడుతున్నారు. అలాగే ఇప్పుడు ఫ్రాన్స్‌లో థియేటర్లు తిరిగి ప్రారంభించాక... సీట్ల మధ్యలో మినియన్స్ టాయ్స్ పెడుతున్నారు. దీని వల్ల సోషల్ డిస్టాన్సింగ్ కచ్చితంగా అమలవుతుందని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్‌లో మార్చిలో లాక్‌డౌన్ విధించగా... ఇప్పుడిప్పుడే మినహాయింపులు ఇస్తున్నారు. తాజాగా సోమవారం నుంచి థియేటర్లు తిరిగి తెరచుకున్నాయి. ఫుల్ సేఫ్టీ చర్యలు తీసుకున్నారు. ప్రతీ రెండు సీట్లలో ఒక సీటును మినియన్స్ టాయ్‌కి కేటాయించారు. అంటే ప్రేక్షకులు సగం మందే ఉంటారని అర్థం.

దక్షిణ ప్యారిస్‌లోని MK2 సినిమా థియేటర్‌లో ఈ టాయ్స్ చూసి... ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఫ్యామిలీతో వచ్చిన వారు మాత్రం ఒకే చోట కూర్చోవచ్చు... తమ మధ్య సీట్లలో టాయ్స్‌ని తీసేసి... వేరే వాళ్లకు అవసరమైన వారికి ఇవ్వొచ్చని చెప్పారు. 2015లో వచ్చిన డెస్పికబుల్ మి సినిమాలో... తొలిసారిగా ఈ మినియన్స్ బొమ్మలు సందడి చేశాయి. అప్పటి నుంచి మినియన్స్ చిన్న పిల్లలకు అత్యంత ఇష్టమైన టాయ్స్‌గా మారాయి.

corona drug, corona vaccine, కరోనా డ్రగ్, కరోనా మందు, కరోనా వ్యాక్సిన్, unlock1, lockdown5, corona warrior, extend the lockdown, corona update, fight with corona virus, covid19, నరేంద్ర మోదీ, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, అన్‌లాక్1,
థియేటర్‌లో మినియన్స్ బొమ్మలు (credit - Reuters/Benoit Tessier)


సోమవారం మధ్యాహ్నం నుంచి MK2 థియేటర్ తెరవగా... ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. రైల్లో, బస్సుల్లో ప్రయాణాల కంటే... థియేటర్‌లో రెండు గంటలు గడపడం పెద్ద రిస్కేమీ కాదని యాజమాన్యం అభిప్రాయపడింది.

ఇక బార్సిలోనాలో గ్రాన్ థియేటర్‌ ఒపేరా హౌస్‌లో మరో రకమైన ఏర్పాటు చేశారు. సీట్ల మధ్య సీట్లలో మొక్కల్ని ఉంచారు. తద్వారా... మంచి ఆక్సిజన్ లభిస్తుందనీ, అలాగే సోషల్ డిస్టాన్స్ కూడా బాగా అమలవుతుందని తెలిపారు. మొత్తం 2292 మొక్కల్ని ఇలా ఏర్పాటు చేయడం అందరికీ నచ్చింది. ఈ కాన్సర్ట్‌ని లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు.

తాము ప్రకృతిని ప్రజల చెంతకు తెస్తున్నామని స్పెయిన్ ఆర్టిస్ట్ యూజెనియో యాంప్యూడియా అన్నారు. కాన్సర్టులో ఉన్నంత సేపూ... ప్రకృతిలో, పార్కులో ఉన్న ఫీల్ కలిగిస్తున్నామని చెప్పారు.

కాన్సర్ట్‌లో సీట్లపై మొక్కలు (Image from AP Photo/Emilio Morenatti)
ఈ కాన్సర్ట్ జరిగింది 8 నిమిషాలే. ఈ సమయంలో... మొక్కలు ఊగేలా... వాటి ఆకుల ధ్వని ప్రేక్షకులకు వినిపించేలా... ప్రత్యేకంగా గాలి ప్రసరణ ఏర్పాట్లు చేశారు. అందువల్ల ఇది అందరికీ నచ్చింది. మొత్తానికి కరోనా వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆరు నెలల కిందట మనం చూసిన ప్రపంచం వేరు... ఇప్పుడు చూస్తున్న ప్రపంచం వేరు.
First published: June 23, 2020, 11:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading