తెలంగాణలో కరోనా ప్రభావం తక్కువే.. బీహార్ లెక్కలే సాక్ష్యం

తెలంగాణలో కరోనా ప్రభావం తక్కువే.. బీహార్ లెక్కలే సాక్ష్యం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ నుంచి తిరిగొచ్చిన వారిలో కేవలం 2శాతం మందికే కరోనా సోకినట్లు బీహార్ అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన వారిలో 367 మందికి కరోనా పరీక్షలు చేయగా కేవలం ఆరుగురికే పాజిటివ్ వచ్చిది.

  • Share this:
    దేశవ్యాప్తంగా వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు వెళ్తున్నారు.  శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు వెళ్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి బీహార్‌కు వెళ్లిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన తమ రాష్ట్ర వలస కార్మికులకు బీహార్ ప్రభుత్వం విధిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.  ఐతే ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన కార్మికుల్లోనే ఎక్కువ మందికి కరోనా సోకినట్లు బీహార్ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్ నుంచి వచ్చిన కార్మికుల్లో ఎక్కువ మంది కరోనా సోకిందని ట్విటర్‌లో ద్వారా వెల్లడించారు.

    ఢిల్లీ నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 26శాతం మందికి, పశ్చిమ బెంగాల్ నుంచి తిరిగొచ్చిన వారిలో 12 శాతం మందికి, మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో 11 శాతం మందికి కరోనా సోకినట్లు బీహార్ అధికారులు తెలిపారు. ఐతే తెలంగాణ నుంచి తిరిగొచ్చిన వారిలో కేవలం 2శాతం మందికే కరోనా సోకినట్లు బీహార్ అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన వారిలో 367 మందికి కరోనా పరీక్షలు చేయగా కేవలం ఆరుగురికే పాజిటివ్ వచ్చిది. అటు ఏపీ నుంచి వచ్చిన వారిలో 128 మందికి పరీక్షలు చేయగా ఎవరికీ కరోనా సోకలేదని తేలింది.
    Published by:Shiva Kumar Addula
    First published: