హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Symptoms: డెల్టా వర్సెస్ ఒమిక్రాన్‌.. కొత్త వేరియంట్‌ బాధితుల్లో భిన్నంగా ఉండే లక్షణాలు ఇవే..!

Covid Symptoms: డెల్టా వర్సెస్ ఒమిక్రాన్‌.. కొత్త వేరియంట్‌ బాధితుల్లో భిన్నంగా ఉండే లక్షణాలు ఇవే..!

ఇటీవలే సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ (Omicron) వేరియంట్‌ భౌగోళిక ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పటివరకు ఉద్భవించిన మిగతా కరోనా వేరియంట్‌ల కంటే ఒమిక్రాన్ ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న తరుణంలో భారత్‌లో థర్డ్ వేవ్ విజృంభిస్తుందా అన్న భయాందోళనలు సైతం మొదలయ్యాయి.

ఇంకా చదవండి ...

  ఇటీవలే సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ (Omicron) వేరియంట్‌ భౌగోళిక ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పటివరకు ఉద్భవించిన మిగతా కరోనా వేరియంట్‌ల కంటే ఒమిక్రాన్ ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న తరుణంలో భారత్‌లో థర్డ్ వేవ్ విజృంభిస్తుందా అన్న భయాందోళనలు సైతం మొదలయ్యాయి. మరోవైపు వ్యాక్సిన్‌ల సమర్థతపై కూడా అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

  మునుపటి వేరియంట్‌ కంటే వేగిరంగా సంక్రమించగలదని నమ్ముతున్న ఒమిక్రాన్ తక్కువ సమయంలో ఎక్కువ జనాభాకు సోకే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఇది ఆధిపత్య వేరియంట్‌గా అవతరించొచ్చు. అయితే డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో నాలుగు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ లక్షణాలు ఏవో చూద్దాం.

  Zodiac Signs: ఈ రాశుల వారు హాలిడే వచ్చిదంటే చాలు.. ఆ పని చేయడంలో వీళ్లను మించిన వారు ఉండరు..

  ఒమిక్రాన్, డెల్టా లక్షణాలలో తేడాలు

  డెల్టా, ఒమిక్రాన్ రెండూ కూడా 2019లో చైనాలో ఉద్భవించిన కోవిడ్-19 అసలైన జాతికి మ్యూటెంట్ వేరియంట్లు. డెల్టా మొదటగా 2020లో భారతదేశంలో వెలుగు చూసింది. ఒమిక్రాన్ కేసులు తొలిసారిగా సౌతాఫ్రికాలో నమోదయ్యాయి. ఈ రెండు వేరియంట్‌ల లక్షణాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.

  డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో అలసట, కీళ్ల నొప్పులు, జలుబు, తలనొప్పులు వంటి నాలుగు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇవి కాకుండా డెల్టా రోగుల్లో సాధారణ లక్షణాలైన వాసన, రుచి కోల్పోవడం లాంటివి ఒమిక్రాన్ బాధితుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని వైద్యులు కనుగొన్నారు

  శ్వాస ఆడకపోవడానికి దారితీయకపోవచ్చు

  డెల్టా వేరియంట్‌ లాగా రోగుల్లో ఊపిరి సలపనివ్వకుండా ఒమిక్రాన్ ఉక్కిరిబిక్కిరి చేయగలదని ఎయిమ్స్ వైద్యుడు సూచించారు. ఇందుకు ఒమిక్రాన్ శ్వాసకోశ వ్యవస్థకు బదులుగా గొంతులో మల్టీప్లై కావడమే కారణమన్నారు. దీని వల్ల ఊపిరితిత్తులపై ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషించారు. దీని అర్థం డెల్టా రోగుల్లా ఒమిక్రాన్ రోగులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలుకావడం, న్యుమోనియా బారిన పడటం వంటివి జరగకపోవచ్చు.

  రోగనిరోధక శక్తి, టీకా ప్రభావం

  ఒమిక్రాన్ వేరియంట్ అనేది సహజ ఇన్‌ఫెక్షన్‌, టీకాలు అందించే రోగనిరోధక శక్తిని దాటుకొని సంక్రమించగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒమిక్రాన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశంపై పూర్తి స్పష్టత కోసం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

  Childrens Study: మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా.. అయితే ఈ చిన్న మార్పులు చేస్తే.. అద్భుతంగా రాణిస్తారు..

  ఎందుకంటే ఒమిక్రాన్‌ ఒక కొత్త వేరియంట్. ఈ కొత్త వేరియంట్ తీవ్రత, వ్యాప్తి, లక్షణాలు గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి పరిశోధన అవసరం. మరోపక్క ఒమిక్రాన్‌ను అడ్డుకోగల కొత్త వ్యాక్సిన్‌ సిద్ధం చేసేందుకు వ్యాక్సిన్ తయారీ దిగ్గజాలు పరిశోధనలు చేస్తున్నాయి.

  ఒమిక్రాన్‌ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా

  పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మాస్క్ ధరించడం, పరిసరాలతో పాటు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

  First published:

  Tags: Covid, Covid -19 pandemic, Delta Variant, Omicron, Omicron corona variant

  ఉత్తమ కథలు