Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS NURSES PROTEST AT KOTI COVID COMMAND CONTROL CENTRE IN HYDERABAD SK

కోఠి కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద నర్సుల ఆందోళన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాంట్రాక్టు పద్ధతిన భర్తీ అని నోటిఫికేషన్ పేర్కొని.. ఇప్పుడేమో ఔట్ సోర్సింగ్ అంటూ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

    హైదరాబాద్‌లో నర్సులు ఆందోళన బాటపట్టారు. కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద సుమారు 150 మంది నర్సులు ధర్నాకు దిగారు. టిమ్స్ ఆస్పత్రిలో కరోనా సేవల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేస్తామని చెప్పి.. అధికారులి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేరాలని అంటున్నారని విమర్శించారు. నోటిఫికేషన్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని వాపోయారు. ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న తమను నోటిఫికేషన్ పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి.. రోడ్డున పడేశారని నర్సుల ఆవేదన వ్యక్తం చేశారు.

    సమాచారం అందుకున్న పోలీసులు కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకొని.. ఆందోళన చేస్తున్న నర్సులకు నచ్చజెప్పారు. ఐతే నర్సులు మాత్రం తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు పద్ధతిన భర్తీ అని నోటిఫికేషన్ పేర్కొని.. ఇప్పుడేమో ఔట్ సోర్సింగ్ అంటూ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు