తెలంగాణలో 400 దాటిన కరోనా కేసుల సంఖ్య.. ఒక్కరోజే 40 పాజిటివ్

ఇండియా లాంటి దేశంలో వైరస్‌ని అరిక్టటాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ గొప్పది కాదని.. అందుకే లాక్‌డౌన్ పొడిగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వైద్యరోగ్యశాఖ తెలిపింది.

news18-telugu
Updated: April 7, 2020, 9:56 PM IST
తెలంగాణలో 400 దాటిన కరోనా కేసుల సంఖ్య.. ఒక్కరోజే 40 పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్క రోజే మరో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 404కి చేరుకుంది. ఇప్పటి వరకు 45 మంది కోలుకొని డిశ్చార్జి కాగా... 11 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 348 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లో 150 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 21 మంది కోలుకున్నారు.

తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన


ఇండియా లాంటి దేశంలో వైరస్‌ని అరిక్టటాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ గొప్పది కాదని.. అందుకే లాక్‌డౌన్ పొడిగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వైద్యరోగ్యశాఖ తెలిపింది. ప్రజలంతా బాధ్యతగా లాక్‌డౌన్‌ను గౌరవించి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. స్పోర్ట్స్‌ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చుతున్నారు. దానికి సంబంధించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 15 అంతస్తుల్లో ఉన్న భవనంలో 1500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ రోజుకు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాలు పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రి పనులను స్వయంగా పరిశీలించారు. ఏప్రిల్ 15 లోగా ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రకటన
First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading