Updated: April 24, 2020, 2:28 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. కోవిడ్ మహమ్మారి విజృంభణతో అక్కడి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. న్యూయార్క్ నగరంలో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 50వేలు దాటింది. రెండు రోజులుగా మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో వ్యాధి తీవ్రత తగ్గిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ గురువారం మళ్లీ అనూహ్యంగా భారీ మొత్తంలో మరణాలు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే అమెరికాలో 3,176 మంది మరణించినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. దాంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 50,243కు చేరింది.
తాజా గణాంకాల ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు 8,86,709 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 85,922 మంది కోలుకోగా.. 50,243 మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 7,50,544 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 14,997 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 27,33,503 మంది కరోనా బారినపడ్డారు. ఈ వ్యాధి నుంచి 7,51,283 మంది కోలుకోగా మొత్తం 1,91,177 మంది కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా 17,91,043 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు
Published by:
Shiva Kumar Addula
First published:
April 24, 2020, 2:21 PM IST