news18-telugu
Updated: April 6, 2020, 10:21 PM IST
ఫిబ్రవరి 21న ఇటలీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్... ఆ దేశంలో మరణమృదంగం మోగించింది. ఇటలీలో ఏకంగా 31 వేల మంది ఈ వైరస్ బారినపడి చనిపోయారు. అమెరికా, బ్రిటన్ తరువాత కరోనా కారణంగా ఎక్కువమంది చనిపోయింది ఇటలీలోనే.
అమెరికాలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో అక్కడ ప్రజలు చనిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజే ఇప్పటి వరకు 700 మందికి పైగా చనిపోయారు. దాంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 10వేల మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు అమెరికాలో 10,327 చనిపోయారు. ఇక న్యూయార్క్‌లో కరోనా ప్రభావం భయంకరంగా ఉంది. ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. మార్చురీలన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. అమెరికాలో 349,992 మందికి కరోనా వైరస్ సోకగా.. వ్యాధి నుంచి 19,226 కోలుకున్నారు. మరో 8,830 పరిస్థితి విషమంగా ఉంది.
న్యూయార్క్‌లో పరిస్థితి చేదాటి పోవడంతో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 29 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 70వేలు దాటింది. ఇప్పటి వరకు 72,636 మంది చనిపోయారు. యూరప్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్‌లో యూకేలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఇటలీలో 16,523, స్పెయిన్‌లో 13,169, ఫ్రాన్స్‌లో 8,078, యూకేలో 5,373 మంది మరణించారు. ఇవాళ ఒక్కరోజే అమెరికాలో 711, ఇటలీ 636, స్పెయిన్ 528, యూకేలో 436 మంది చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Worldmeters)
Published by:
Shiva Kumar Addula
First published:
April 6, 2020, 10:18 PM IST