మహారాష్ట్రపై కరోనా బీభత్సం..1,000 దాటిన కేసులు.. 60శాతం ముంబైలోనే

ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 590కి చేరింది. అంటే మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల్లో ముంబైలోనే 60శాతం నమోదయినట్లు స్పష్టమవుతోంది.

news18-telugu
Updated: April 7, 2020, 8:40 PM IST
మహారాష్ట్రపై కరోనా బీభత్సం..1,000 దాటిన కేసులు.. 60శాతం ముంబైలోనే
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 150 పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అందులో 116 కేసులు ఒక్క ముంబై పరిధిలోనే వచ్చినట్లు వెల్లడింది. అంతేకాదు మరో ఐదు మంది ఇవాళ ముంబైలో చనిపోయారు. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 1018కి చేరింది. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 590కి చేరింది. అంటే మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల్లో ముంబైలోనే 60శాతం నమోదయినట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు ఒక్క ముంబైలోనే ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు. దీన్ని బట్టి అక్కడ కరోనా తీవ్ర ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.


మంగళవారం మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు:




















































ప్రాంతం కరోనా కేసులు
ముంబై 116
పుణె 18
అనాగర్ 3
బుల్దానా 3
థానె 2
నాగ్‌పూర్ 3
అబాద్ 3
సతారా 1
రత్నగిరి 1
సంగాలి 1
మొత్తం 150


First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading