ఏపీలో 314కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదయ్యాయి. 43 కేసులతో నెల్లూరు రెండో స్థానంలో ఉంది.

news18-telugu
Updated: April 7, 2020, 10:18 PM IST
ఏపీలో 314కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
తెలంగాణతో పాటు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవాళ మరో 10 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిపిన పరీక్షల్లో పది మందికి వైరస్ సోకినట్లు వెల్లడయిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ గుంటూరులో 8, కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 314కు చేరింది. ఇప్పటి వరకు ఆరుగురు కోలుకొని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదయ్యాయి. 43 కేసులతో నెల్లూరు రెండో స్థానంలో ఉంది. 41 కేసులతో గుంటూరు మూడో స్థానంలో ఉంది. ఐతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన


ఇక కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వెంటిలేటర్లను రాష్ట్ర, జిల్లా స్థాయి కోవిడ్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లోని వెంటిలేటర్లను కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని నిర్ణయించింది. ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి తీసుకున్న వెంటిలేటర్లకు అద్దె కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం సంబంధిత యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. తాము తీసుకున్న వెంటిలేటర్లను సురక్షితంగా తిరిగి అందజేస్తామని.. ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులకు భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading