మహారాష్ట్రలో ఒక్కరోజే 8వేల మందికిపైగా కరోనా రోగుల డిశ్చార్జి

మహారాష్ట్రలో శుక్రవారం 8,381 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 116 మంది మరణించారు.

news18-telugu
Updated: May 29, 2020, 10:44 PM IST
మహారాష్ట్రలో ఒక్కరోజే 8వేల మందికిపైగా కరోనా రోగుల డిశ్చార్జి
ఆ లెక్కన 67 కోట్లలో 5 శాతం అంటే సుమారు 30 మిలియన్లు (3 కోట్ల మంది) పరిస్థితి విషమంగా ఉంటుందన్నమాట.
  • Share this:
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. శుక్రవారం కూడా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,682 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 8,381 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 116 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 62,228కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 26,997 మంది కోలుకోగా..2,098 మంది మరణించారు. మహారాష్ట్రలో 38,939యాక్టిక్ కరోనా కేసులున్నాయి.

ఇక మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. శుక్రవారం 1437 కొత్త కేసులు నమోదవడంతో పాటు 38 మంది మరణించారు. దాంతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36710కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1173 మంది మరణించారు.

First published: May 29, 2020, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading