తమిళనాడులో 20వేలు దాటిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో 874 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ 765 మంది డిశ్చార్జి కాగా.. 9 మంది మరణించారు

news18-telugu
Updated: May 29, 2020, 8:43 PM IST
తమిళనాడులో 20వేలు దాటిన కరోనా కేసులు
ఆ లెక్కన 67 కోట్లలో 5 శాతం అంటే సుమారు 30 మిలియన్లు (3 కోట్ల మంది) పరిస్థితి విషమంగా ఉంటుందన్నమాట.
  • Share this:
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 874 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  ఇవాళ 765 మంది డిశ్చార్జి కాగా.. 9 మంది మరణించారు. తాజా లెక్కలతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య  20,246కి చేరింది. కరోనా వైరస్‌తో పోరాడుతూ ఇప్పటి వరకు 11,313 మంది కోలుకోగా.. 154 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 8,776 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 7,466 కొత్త కేసులు నమోదవగా.. 175 మంది మరణించారు. మనదేశంలో ఇప్పటి వరకు 1,65,799 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 71,106 మంది కోలుకోగా.. 4,706 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 89,987 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 29, 2020, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading