హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

నీతి ఆయోగ్ అధికారికి కరోనా పాజిటివ్.. ఆఫీసు మూసివేత

నీతి ఆయోగ్ అధికారికి కరోనా పాజిటివ్.. ఆఫీసు మూసివేత

టాప్ 3 : ఢిల్లీ (యాక్టివ్ కేసులు 36,612,  మరణాలు 1655)

టాప్ 3 : ఢిల్లీ (యాక్టివ్ కేసులు 36,612, మరణాలు 1655)

నీతి ఆయోగ్ కార్యాలయాన్ని 48 గంటలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆఫీసు బిల్డింగ్‌తో పాటు పరిసరాలను శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు సైతం కోవిడ్ మహమ్మారి విస్తరిస్తోంది. ఇప్పటికే లోక్‌సభ సెక్రటేరియెట్, పౌరవిమానయాన శాఖ, సుప్రీంకోర్టు ఉద్యోగులకు కరోనా సోవడంతో తీవ్ర కలకలం రేగింది. తాజాగా నీతి ఆయోగ్‌లో పనిచేసే ఉద్యోగికి కరోన పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. ఈమేరకు నీతి ఆయోగ్ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం నీతి ఆయోగ్ కార్యాలయాన్ని 48 గంటలు మూసివేస్తున్నట్లు తెలిపింది. ఆఫీసు బిల్డింగ్‌తో పాటు పరిసరాలను శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్తగా సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సదరు ఉద్యోగికి ఎవరెవరు కలిశారన్న దానిపై ఆరాతీస్తున్నారు.


కరోనా బాధిత ఉద్యోగి నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నట్లు PTI వార్తా సంస్థ తెలిపింది.


కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం.. భారత్‌లో ఇప్పటి వరకు 29,435 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ 6,868 మంది కోలుకోగా.. 934 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,632 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

First published:

Tags: Coronavirus, Covid-19, New Delhi, Niti Aayog

ఉత్తమ కథలు