Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS NEW 1892 CASES REPORTED IN TELANGANA TODAY SK

వామ్మో.. తెలంగాణలో ఒక్క రోజే 1,892 కేసులు.. హైదరాబాద్‌లోనే అత్యధికం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5,965 శాంపిల్స్‌ను పరీక్షించారు. వీరిలో 4,073 మందికి నెగెటివ్ వచ్చింది. 1,892 మందికి పాజిటివ్ వచ్చింది.

    తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. శుక్రవారం కూడా భారీగా కొత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 1,126 మంది డిశ్చార్జి కాగా.. మరో 8 మంది మరణించారు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే 1,658 కేసులు వచ్చాయి. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,462కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 10,195 మంది కోలుకోగా.. 283 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,984 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

    ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5,965 శాంపిల్స్‌ను పరీక్షించారు. వీరిలో 4,073 మందికి నెగెటివ్ వచ్చింది. 1,892 మందికి పాజిటివ్ వచ్చింది. ఐతే ప్రైవేట్ ల్యాబ్స్‌లోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ చెబుతోంది. ముఖ్యంగా ఓ ల్యాబ్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. అందుకే శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అటు తెలంగాణలో ఇప్పటి వరకు 1,04,118 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

    జిల్లాల వారీగా వివరాలు:

    వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid, GHMC, Hyderabad, Telangana

    తదుపరి వార్తలు