Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కి కరోనా పాజిటివ్

    తన ఆరోగ్యంపై ఆందోళన చెందల్సిన అవసరం లేదని.. కరోనా బారినపడిన తన గన్‌మెన్ సెలవులో ఉన్నాడని రోజా తెలిపారు. 18 రోజులుగా విధులుగా రావడం లేదని చెప్పారు.

    news18-telugu
    Updated: July 10, 2020, 11:22 AM IST
    నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కి కరోనా పాజిటివ్
    ఎమ్మెల్యే రోజా (Twitter/Photo)
    • Share this:
    ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతల్లో కరోనా టెన్షన్ రేపుతోంది. భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజగా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కూడా కరోనా బారినపడ్డారు. తిరుపతిలోని స్విమ్స్‌కు ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ రావడం.. ఆమె ఇటీవల మాస్క్ లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో.. వైసీపీ కార్యకర్తలు ఆందోళన నెలకొంది.

    ఐతే తన ఆరోగ్యంపై ఆందోళన చెందల్సిన అవసరం లేదని.. కరోనా బారినపడిన తన గన్‌మెన్ సెలవులో ఉన్నాడని రోజా తెలిపారు. 18 రోజులుగా విధులుగా రావడం లేదని చెప్పారు.

    ఏపీలో ఇప్పటి వరకు 23,814 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 11,383 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 16,882 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,500 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక గురువారం వరకు 10,94,615 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
    Published by: Shiva Kumar Addula
    First published: July 10, 2020, 9:42 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading