అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... నేతలకు టెన్షన్...

ఈ కరోనా వైరస్ డాక్టర్లు, పోలీసులనే కాదు... ప్రజా ప్రతినిధులను కూడా వదలట్లేదు. ఎప్పుడోకప్పుడు, ఎక్కడో ఒక చోట కరోనాకు దొరికిపోతున్నారు.

news18-telugu
Updated: July 18, 2020, 10:59 AM IST
అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... నేతలకు టెన్షన్...
అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్... నేతలకు టెన్షన్...
  • Share this:
కంటికి కనిపించని కరోనా వైరస్‌ని కనిపెట్టడం కష్టమైపోతోంది. చుట్టుపక్కల ఉన్న వారంతా... కరోనా పాజిటివ్‌లు కానట్లే కనిపిస్తున్నారు. వాళ్లలో ఎవరైనా అసింప్టమేటిక్ ఉన్నవారు ఉంటే... వాళ్లలో లక్షణాలు కనిపించకపోయినా... లోపల ఉండే కరోనా వైరస్ వారి నుంచి ఇతరులకు పాకేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ వచ్చింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలగానే... ఆయన అప్రమత్తం అయ్యారు. తనతో తిరిగిన వారు, తనను కలిసివారు అందరూ టెస్ట్ చేయించుకోవాలని కోరారు.

బియ్యపు మధుసూధన్ రెడ్డి (File)


నిన్న తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిఏకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అంబాజీపేటలో సంచార సంజీవనిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. అదే అంబాజీపేటలో మరో 12 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. పీఏకు కరోనా రావడంతో ఎమ్మెల్యే, చిట్టిబాబుతో పాటు గత 10,15 రోజులుగా తిరిగిన నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. వీరిలో కొందరు టెస్ట్‌లు చేయించుకోవడానికి.. మరికొందరు హోం క్వారంటైన్‌లో ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరిలో కరోనా సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో అత్యధికంగా 24 గంటల్లోనే 634 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత గుంటూరులో 367, చిత్తూరు 328, కర్నూలు 315 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 297, శ్రీకాకుళం 149, నెల్లూరు 127, పశ్చిమ గోదావరి 109, విజయనగరం 89, కడప 55, ప్రకాశం 53, కృష్ణా 37, విశాఖపట్నం జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులొచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 42 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, ప్రకాశం 5, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, కడప 3, విశాఖపట్నం 3, కర్నూలు 2, నెల్లూరు 2, విజయనగరం 2, కృష్ణాలో ఒకరు కరోనా వల్ల మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది.
Published by: Krishna Kumar N
First published: July 18, 2020, 10:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading