Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS MINISTER KTR ETELA RAJENDER VISITS GACHIBOWLI CORONA HOSPITAL WORKS IN HYDERABAD SK

మరో వారంలో కరోనా ఆస్పత్రి సిద్ధం.. 15 అంతస్తులు, 1500 పడకలు

కరోనా ఆసుపత్రులను పరిశీలించిన ...మంత్రులు

కరోనా ఆసుపత్రులను పరిశీలించిన ...మంత్రులు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ రోజుకు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు.

    తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మర్కజ్ కేసులతో మరింత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తూనే వైద్య సదుపాయాలను పెంచుతోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. స్పోర్ట్స్‌ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చుతున్నారు. దానికి సంబంధించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 15 అంతస్తుల్లో ఉన్న భవనంలో 1500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ రోజుకు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాలు పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రి పనులను స్వయంగా పరిశీలించారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు.. మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 లోగా ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది ఇవాళ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 45 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. 11 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 308 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తెలంగాణలో ఒక్క హైదరాబాద్‌లోనే 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Eetala rajender, Hyderabad, KTR, Telangana

    తదుపరి వార్తలు