బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం.. రాష్ట్రాలను విమర్శించడం రాజనీతా..?

దేశానికి వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసని నడ్డాయే.. వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

news18-telugu
Updated: June 21, 2020, 4:43 PM IST
బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం.. రాష్ట్రాలను విమర్శించడం రాజనీతా..?
జేపీ నడ్డా, హరీష్ రావు
  • Share this:
కరోనా కట్టడి చర్యలు, టెస్టుల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. టెస్టులు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఆయన్ను టార్గెట్ చేసుకున్నారు. కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా ? అని మండిపడ్డారు. దేశానికి వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసని నడ్డాయే.. వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సైనికుల నైతికస్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? దేశానికి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంఉన్న మీరే వైద్యులు చేస్తున్నకృషిని తక్కువ చేసి చూపడం సబబా? ఇది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్య కాదా?

మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోన విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం. దయచేసి ఇది గుర్తుంచుకోవాలి.
హరీష్ రావు
మంత్రి ఈటల రాజేందర్ సైతం జేపీ నడ్డాపై మండిపడ్డారు. తెలంగాణలో మరణాలు రేటు జాతీయ మరణాల రేటు కంటే ఎక్కువగా ఉందంటూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేేపీ నేతలు చిల్లరమల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జేపీ నడ్డా జాతీయ స్థాయి నేతలా కాకుండా గల్లీ లీడర్‌లా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. కాగా, తెలంగాణలో కరోనా కట్టడిలో ప్రభుత్వ విఫలమైందంటూ సోమవారం బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
First published: June 21, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading