ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు సహకరించండి.. ఉర్దూలో హరీష్ రావు విజ్ఞప్తి

సంగారెడ్డిలో 6 కేసులతో పాటు ములుగులో రెండు కేసులు బయట పడడంతో ఇవాళ ఇప్పటి వరకు 8 కొత్త కేసులు బయటపడినట్లయింది. తాజా కేసులను ఇవాళ్టి బులెటిన్‌లో ప్రకటించాల్సి ఉంది.

news18-telugu
Updated: April 2, 2020, 8:38 PM IST
ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు సహకరించండి.. ఉర్దూలో హరీష్ రావు విజ్ఞప్తి
మంత్రి హరీష్ రావు
  • Share this:
సంగారెడ్డిలో గురువారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి హరీష్ రావు అప్రమత్తమయ్యారు. వెంటనే సంగారెడ్డికి వెళ్లి కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. అనంతరం నారాయణ IIT అకాడమీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న 43 మంది మర్కజ్ కరోన బాధితుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు దయచేసి సహకరించాలని ఉర్దూలో విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. అజ్బర్వేషన్‌లో ఉంచేందుకు ఇక్కడికి తీసుకొచ్చామని.. పరీక్షల్లో కరోనా నెగెటివ్ వస్తే తిరిగి ఇంటికి పంపిస్తామని తెలిపారు. ఒకవేళ పాజిటివ్ వస్తే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తామని చెప్పారు మంత్రి హరీష్.

మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీకు కరోనా సోకిందని కాదు. అబ్జర్వేషన్‌లో ఉంచేందుకు మాత్రమే. నిర్ణీత సమయంలో పరీక్షలు జరిపితే, ఎలాంటి వ్యాధి నమూనాలు కనిపించక పోతే తిరిగి మీ ఇంటికి పంపిస్తాం. ఒక వేళ మీకు వ్యాధి సోకితే మాత్రమే గాంధీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయిస్తాం. సంగారెడ్డిలో ఇప్పటివరకు గుర్తించిన 22 మందిలో 6 గురికి మాత్రమే కరోన వ్యాధి సోకింది. మిగతావారికి నిర్ధారణ కాలేదన్నారు. మీరు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులంతా దయచేసి పోలీసులు, వైద్యులకు సహకరించాలి.
హరీష్ రావు, మంత్రి


గురువారం సంగారెడ్డిలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సంగారెడ్డి జిల్లా DMHO మోజిరాం రాథో తెలిపారు. ఈ ఆరుగురు ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరయ్యారు. ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో కరోనా కేసులు ఎక్కువగా బయపడుతుండడంతో.. అక్కడికి వెళ్లొచ్చినవారంరికీ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి నుంచి వెళ్లిన వారికి పరీక్షలు చేయగా.. గురువారం ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంగారెడ్డి టౌన్‌లో ఇద్దరు, సంగారెడ్డి శివారులోని అంగడిపేట గ్రామంలో ఇద్దరు, కొండాపూర్‌, జహీరాబాద్‌ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్‌ సోకిందని జిల్లా అధికారులు తెలిపారు. బాధితుల్లో ఐదుగురు 40ఏళ్ల లోపువారేకావడం గమనార్హం.

సంగారెడ్డిలో 6 కేసులతో పాటు ములుగులో రెండు కేసులు బయట పడడంతో ఇవాళ ఇప్పటి వరకు 8 కొత్త కేసులు బయటపడినట్లయింది. తాజా కేసులను ఇవాళ్టి బులెటిన్‌లో ప్రకటించాల్సి ఉంది. ఇక బుధవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 9 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 104 యాక్టివ్ కేసులున్నాయి.వీడియో ఇక్కడ చూడండి:
First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading