Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS MAY SPREAD WITH TEARS KNOW HOW TO PREVENT IT AK GH

CoronaVirus: కన్నీళ్ల ద్వారా కరోనా వ్యాప్తి.. తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమృత్‌సర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కన్నీళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందని తేలినట్లు ఎస్‌ఎల్ రహేజా ఆసుపత్రికి చెందిన డా.సంజిత్ శశిధరన్ వెల్లడించారు.

కోవిడ్ రోగులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బయటకు వచ్చే బిందువుల ద్వారా కరోనా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఇది శ్లేష్మం ద్వారా కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే తాజాగా కరోనా వ్యాప్తిపై చేసిన ఓ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కోవిడ్ సోకిన రోగుల కన్నీళ్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. అమృత్‌సర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కన్నీళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందని తేలినట్లు ఎస్‌ఎల్ రహేజా ఆసుపత్రికి చెందిన డా.సంజిత్ శశిధరన్ వెల్లడించారు.

అయితే, టెస్ట్ చేసిన మొత్తం శాంపిల్స్ లలో వ్యాప్తి అనేది 17.5 శాతంగా మాత్రమే ఉన్నట్లు తేలింది. ‘ఓక్యులర్ మానిఫెస్టేషన్’ కలిగిన కరోనా రోగులతో సహా ‘ఓక్యులర్ మానిఫెస్టేషన్’ లేని కరోనా రోగుల నుంచి శాంపిల్స్ సేకరించారు శాస్త్రవేత్తలు. వీరి కళ్ళలో వైరస్ ఉనికి ఉందా అనే కోణంలో శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మలం, కళ్ల స్రావాలు వంటి ఇతర మార్గాల ద్వారా కోవిడ్-19 వ్యాధి ప్రబలుతుందా అనే కోణంలోనూ అధ్యయనం చేశారు. అయితే కంటి కదలికలు లేకుండానే.. కరోనా సోకిన రోగులు కన్నీరు, కండ్లకలక స్రావాల ద్వారా వ్యాధిని వ్యాప్తి చేయగలరని అధ్యయనంలో తేలింది.

ఎస్‌ఎల్ రహేజా ఆసుపత్రిలో కన్సల్టెంట్ హెడ్-క్రిటికల్ కేర్, మహిమ్-ఎ ఫోర్టిస్ అసోసియేట్ గా పనిచేస్తున్న డా.సంజిత్ శశిధరన్ అధ్యయనంలో తేలిన నిజాలను బయటపెట్టారు. ఆప్టిషియన్లు, నేత్రవైద్యులతో పాటు సెలూన్లు, బ్యూటీషియన్లలో పనిచేసే ప్రజలందరికీ ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. వీరంతా కరోనా సోకిన రోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కన్నీళ్ల ద్వారా కరోనా ఎలా సోకుతుంది..?
కన్నీళ్లు, కన్నీళ్లు పడిన ఉపరితలాలు తాకడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. వైరస్ కలిగిన కన్నీళ్లు తాకిన తర్వాత మీ కళ్లను తాకడం ద్వారా కూడా కరోనా సోకవచ్చు. అలాగే, కరోనావైరస్ పింక్ ఐ ఇన్ఫెక్షన్ (కండ్లకలక) అనే అరుదైన వ్యాధి రావచ్చు. ఇది బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది కాబట్టి వైద్యులను సంప్రదించడం ముఖ్యం.

* నివారణ మార్గాలేంటి?

1. కోవిడ్ -19 సోకినవారు కళ్లను ఎట్టి పరిస్థితులలోనూ రుద్దుకోకూడదు.

2. దగ్గినప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు మీ నోరు, ముక్కును టిష్యూ పేపర్‌తో కవర్ చేయండి. వాటిని చెత్తబుట్టలో పారేయండి.

3. తక్షణమే మీ చేతులను సబ్బు నీటితో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోండి. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే.. 60% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడగండి.

4. కరోనా సోకిన వ్యక్తుల సమీపంలో ఉంటే మీ కళ్ళు, ముక్కు, నోటిని కడగని చేతులతో తాకడం వంటివి చేయకూడదు.

5. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు దగ్గరగా ఉండకూడదు.

6. పబ్లిక్ ప్రదేశాలు, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాస్కులు ధరించాలి.

7. బాధితులు ఇంట్లో ఉంటే.. రోజూ తరచుగా తాకే ఉపరితలాలను క్రిమిసంహారక మందులతో కడిగి శుభ్రంగా ఉంచాలి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Coronavirus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు