సెక్స్ ద్వారా కరోనా సంక్రమిస్తుందా?... కొన్ని కోట్ల మంది ప్రశ్నకు సమాధానం...

సెక్స్ ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం కొన్ని కోట్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: April 23, 2020, 5:01 PM IST
సెక్స్ ద్వారా కరోనా సంక్రమిస్తుందా?... కొన్ని కోట్ల మంది ప్రశ్నకు సమాధానం...
ప్రతికాత్మక చిత్రం
  • Share this:
సెక్స్ ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం కొన్ని కోట్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అమెరికాలోని ఓ పరిశీలన ప్రకారం సెక్స్ చేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని తేలింది. మగవారి వీర్యం, వృషణాల్లో కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని అమెరికాలోని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన ఫెర్టిలిటీ & స్టెరిలిటీ జర్నల్‌లో దీనికి సంబంధించిన ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. అయితే, ఇది ప్రాధమిక స్థాయిలో జరిగిన పరిశీలనే. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ ద్వారా కరోనా రాదు అని చెప్పడానికి వీల్లేదని కూడా తెలిపింది. అయితే, ఆ మాత్రం గుడ్ న్యూస్ అయినా చాలు అని సంబరపడే వారు చాలా మంది ఉన్నారు. పరిమిత స్థాయిలో జరిగిన పరిశోధన అని, పూర్తిస్థాయి పరిశోధన జరగాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

‘కోవిడ్ 19‌ను కలుగచేసే వైరస్ మగవారి వీర్యం, వృషణాల్లో లేదని ఈ చిన్న, ప్రాధమిక పరిశీలనలో తేలింది. ఇది చాలా ముఖ్యమైన అంశం.’ అని యూనివర్సిటీ ఆఫ్ ఊటాకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ జేమ్స్ ఎం హోటలింగ్ చెప్పారు. ఒకవేళ కరోనా లాంటి వైరస్ సెక్స్ ద్వారా వ్యాపిస్తే అది మరింత ప్రమాదం. అప్పుడు వ్యాధి నియంత్రణ చాలా కష్టంగా మారుతుంది. అప్పుడు ఆరోగ్య పరంగా దీర్ఘకాలం పాటు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హోటలింగ్ అభిప్రాయపడ్డారు. ఎబోలా, జికా వైరస్ తరహాలో కరోనా కూడా సెక్స్ ద్వారా సంక్రమిస్తుందా? అనే అంశంపై చైనా, అమెరికా లాంటి దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.

చైనాలో జరగిన పరిశోధనల్లో కూడా వీర్యంలో ఎలాంటి కరోనా వైరస్ కణాలు లేవని గుర్తించారు. అయితే, పెద్ద ఎత్తున వైరస్ దాడికి గురైన వ్యక్తి వీర్యం మీద కూడా వైరస్ ప్రభావం చూపించవచ్చేమో. దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేమని హోటలింగ్ చెప్పారు. సెక్స్ ద్వారా కరోనా వైరస్ సంక్రమించేందుకు ప్రాధమిక ఆధారాలు ఇప్పటి వరకు లేకపోయినా, ముద్దుపెట్టుకోవడం, దగ్గడం, చీదడం వల్ల కరోనా వ్యాపిస్తుందని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 23, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading