కరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా హెచ్చరిక..

కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేసింది. మన జీవితాల్లోంచి ఆ వైరస్ ఎప్పటికీ పోదని పెద్ద బాంబ్ పేల్చింది.

news18-telugu
Updated: May 14, 2020, 7:43 AM IST
కరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా హెచ్చరిక..
ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • Share this:
కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేసింది. మన జీవితాల్లోంచి ఆ వైరస్ ఎప్పటికీ పోదని పెద్ద బాంబ్ పేల్చింది. వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ వైరస్‌ను నియంత్రించడం అనేది కష్టమైన పని అని.. దాని కోసం ప్రపంచం పెద్ద కసరత్తే చేయాలని వ్యాఖ్యానించింది. హెచ్‌ఐవీ వైరస్‌ ఎలాగైతే అంతం కాలేదో.. ఇదీ అంతేనని.. ఉదహరించింది. మీడియాతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ డైరెక్టర్ డాక్టర్ మైక్ రియాన్ పై వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి మనతో పాటు జీవనం కొనసాగిస్తుందని.. ఇది పూర్తిగా అంతం అవుతుందని ఎవ్వరూ అంచనా వేసే స్థితి లేదన్నారు. దీన్ని నియంత్రించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మన కర్తవ్యం అదేనని పునరుద్ఘాటించారు.

అటు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలు దాటింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి దాకా 44,25,639 కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,97,765 మంది కరోనా సోకి మరణించారు. అటు.. 16,57,068 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 24,70,806 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 45,921 మంది ఆరోగ్యం క్రిటికల్‌గా ఉంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 14, 2020, 7:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading