తమిళనాడు సంచలన నిర్ణయం.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్

లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రం తమిళనాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులకు అనుమతిస్తారు.

news18-telugu
Updated: June 15, 2020, 5:30 PM IST
తమిళనాడు సంచలన నిర్ణయం.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్
లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రం తమిళనాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులకు అనుమతిస్తారు.
  • Share this:
భారత్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకు 11వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఐనప్పటికీ మళ్లీ లాక్‌డౌన్ విధించే ఉద్దేశం లేదని మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నై చుట్టుపక్కల భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పళని స్వామి ప్రకటించారు. ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రం తమిళనాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులకు అనుమతిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు. ట్యాక్సీలు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలేవీ ఈ 12 రోజులు రోడ్డెక్కడానికి వీళ్లేదు. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, మన దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి వరకు తమిళనాడులో 44,661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 24,547 మంది కోలుకోగా.. 435 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 19,676 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడులో నమోదైన కేసుల్లో అత్యధికం చెన్నైలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది తమిళనాడు ప్రభుత్వం.
Published by: Shiva Kumar Addula
First published: June 15, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading