మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. 70వేలు దాటిన కేసులు

సోమవారం రాష్ట్రంలో నమోదైన 2,358 కేసుల్లో 1,413 కేసులు ముంబై నుంచే వచ్చాయి. ఇవాళ మరో 40 మంది మరణించారు.

news18-telugu
Updated: June 1, 2020, 10:46 PM IST
మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. 70వేలు దాటిన కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సోమవారం కూడా భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,358 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 779 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 76 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 70,013కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 30,108 మంది కోలుకోగా..2,362 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 37,534 యాక్టిక్ కరోనా కేసులున్నాయి.

ఇక మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. సోమవారం రాష్ట్రంలో నమోదైన 2,358 కేసుల్లో 1,413 కేసులు ముంబై నుంచే వచ్చాయి. ఇవాళ మరో 40 మంది మరణించారు. తాజా లెక్కలతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,887కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,319 మంది మరణించారు.

First published: June 1, 2020, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading