24 గంటల్లో బయటకు రావాలి.. తబ్లిఘీలకు సీఎం సీరియస్ వార్నింగ్

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 13 మంది మృతిచెందారు.

news18-telugu
Updated: April 8, 2020, 3:53 PM IST
24 గంటల్లో బయటకు రావాలి.. తబ్లిఘీలకు సీఎం సీరియస్ వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లి నిజాముద్దీన్‌లోని మర్జజ్‌లో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారి వల్లే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు తబ్లీఘి జమాత్‌కు వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి పరీక్షలు చేయిస్తున్నారు. ఐతే వారిలో కొందరు ప్రభుత్వాలకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాంటి వారికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మర్కజ్‌లో పాల్గొన్న వ్యక్తులు వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. బయటకు రాకుండా దాక్కున్న తబ్లీఘీలు.. 24 గంటల్లో రిపోర్టు చేయపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాస్త గట్టిగానే హెచ్చరించారు. వారంతా క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని

మధ్యప్రదేశ్ నుంచి నిజాముద్దీన్‌ మర్కజ్‌లో పాల్గొన్న వారిని రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌ సైంటర్లకు తరలించింది. మసీదుల్లో తలదాచుకున్న కొందరు విదేశీయులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఐతే కొందరు మాత్రం ఎక్కడో దాక్కొని ఉన్నారు. వారంతా 24 గంటల్లో అధికారులకు రిపోర్ట్ చేయాలి. లేదంటే రాష్ట్ర, దేశ భద్రతకు ముప్పుగా పరిగణించి కఠిన శిక్షలు విధించేలా క్రిమనల్ కేసులు పెడతాం.
శివరాజ్ సింగ్ చౌహాన్


madhya pradesh,Shivraj Singh Chouhan,Shivraj Singh Chouhan takes oath as cm,telugu news,మధ్యప్రదేశ్ సీఎం, మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్,తెలుగు న్యూస్
శివరాజ్ సింగ్

కాతా, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 13 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు ఆస్పత్రుల నుంచి ఎవరూ డిశ్చార్జి కాలేదని అధికారులు తెలిపారు.

అటు మహారాష్ట్రలోనూ కొందరు తబ్లీఘీ జామాత్ కార్యకర్తలు తప్పించుకు తిరుగుతున్నారు. ఢిల్లీ మర్కజ్‌లో తబ్లీఘీ జమాత్ సదస్సుకు హాజరై మహారాష్ట్రకు తిరిగొచ్చిన వారిలో 50 నుంచి 60 మంది తమ మొబైల్ ఫోన్లని స్విచాప్ చేశారని అధికారులు తెలిపారు. పోలీసులు, వైద్య అధికారుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా మర్కజ్ కేసులు బయటపడడంతో.. వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు గాలిస్తున్నారని స్పష్టం చేశారు మహారాష్ట్ర అధికారులు.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading