CORONAVIRUS LOCKDOWN LEARN THESE FREE ONLINE COURSES TO UPSKILL YOURSELF DURING WORK FROM HOME SS
Free Courses: ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఆన్లైన్లో ఫ్రీగా ఈ కోర్సులు చేయండి
Free Courses: ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఆన్లైన్లో ఫ్రీగా ఈ కోర్సులు చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Free Online Courses | కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్లు తమకు నచ్చిన అంశాలు నేర్చుకోవడానికి మంచి సమయం ఇది. మరి ఈ ఉచిత ఆన్లైన్ కోర్సుల్లో మీకు నచ్చినవి నేర్చుకోవచ్చు.
కరోనా వైరస్ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. సాధారణ జీవితం అస్తవ్యస్తమైంది. విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే కొత్తగా ఏదైనా నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందించే సంస్థలు చాలా ఉన్నాయి. మరి మీరేం నేర్చుకోవచ్చో తెలుసుకోండి.
Artificial Intelligence: స్మార్ట్ఫోన్ల నుంచి అత్యాధునిక వైద్య పరికరాల వరకు అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా. ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అందిస్తోంది. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Coding and IT Essentials: భారతీయ స్టార్టప్ Guvi ఐఐటీ మద్రాస్ సహకారంతో ఏర్పాటైంది. ఐటీ రంగంలో ఉపాధి కల్పించే అనేక ఆన్లైన్ కోడింగ్ కోర్సుల్ని అందిస్తోంది. మీరు ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నా, ఐటీ రంగంపై ఆసక్తి ఉన్నా ఈ కోర్సులు చేయొచ్చు. పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇలా చాలా కోర్సులున్నాయి. సాధారణంగా ఈ కోర్సులకు డబ్బులు చెల్లించాలి. కానీ మార్చి 31 వరకు ఈ కోర్సులు ఉచితం. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రతీకాత్మక చిత్రం
Writing: మీరు రైటర్ కావాలనుకుంటున్నారా? అందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా? మీరే స్వయంగా ఓ నవల రాద్దామనుకుంటున్నారా? అయితే రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇది సాధ్యం. ఈ లింక్ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Photography: ఫోటోగ్రఫీ మీకు ఇష్టమా? అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఆన్లైన్ ఫోటోగ్రఫీ కోర్సుల్ని అందిస్తున్నారు. 1,100 పైగా కోర్సులున్నాయి. ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసి నేర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Smart Cities: స్మార్ట్ సిటీలు, వాటితో ఉండే లాభాల గురించి ఓపెన్ యూనివర్సిటీలో రెండు వారాల కోర్స్ ఉంది. స్మార్ట్ సిటీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందేందుకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
Block Chain and Cryptocurrencies: బ్లాక్ చెయిన్ రెవల్యూషన్ స్పెషలైజేషన్ కోర్స్‌ని ఆఫర్ చేస్తోంది బ్లాక్ చెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్రస్తుతం ఈ కోర్స్ ఉచితం. బ్లాక్ చెయిన్‌కు సంబంధించిన పూర్తి నాలెడ్జ్ పొందొచ్చు. ఇందుకోసం మీరు వారానికి 12 గంటలు కేటాయిస్తే చాలు. ఇక్కడ క్లిక్ చేసి జాయిన్ కావొచ్చు.
Mandarin Chinese: కొత్తగా ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే మాండరిన్ చైనీస్ భాషకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఈ భాష నేర్చుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.