CORONAVIRUS LOCKDOWN KNOW WHICH STATES OFFER RELAXATIONS FROM APRIL 20 SS
Coronavirus lockdown: లాక్డౌన్లో నేటి నుంచి మినహాయింపులు... కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే
ప్రతీకాత్మక చిత్రం
Coronavirus Relaxations | ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్లో సడలింపులు అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఏఏ రాష్ట్రాల్లో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయో తెలుసుకోండి.
కరోనా వైరస్ లాక్డౌన్లో ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఉంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ఎలాంటి మినహాయింపులు ఉండవని, లాక్డౌన్ యథాతథంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు లాక్డౌన్ మే 7 వరకు కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు. స్విగ్గీ, జొమాటోపై నిషేధం విధించారు. మే 7 వరకు విమాన సర్వీసుల్ని అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. గతంలో విడుదల చేసిన లాక్డౌన్ మార్గదర్శకాలు కొనసాగుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిర్మాణం, తయారీ రంగం, ఐటీ కంపెనీలు లాంటి ఆర్థిక కార్యకలాపాలకు మినహాయింపులు ఉన్నాయి. పరిశ్రమలు పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైస్ మిల్, పిండి మరలు, డైరీ ఉత్పత్తులు, ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఫార్మా, సబ్బులు, మాస్కులు, బాడీ సూట్లు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ, ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు మినహాయింపు లభించింది.
అయితే లాక్డౌన్ మినహాయింపులపై వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. కర్నాటక ప్రభుత్వం నిర్మాణ రంగానికి అనుమతి ఇచ్చింది. హాట్‌స్పాట్స్‌లో లాక్డౌన్ యథాతథంగా కొనసాగుతుంది. తమిళనాడులో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. గుజరాత్లో ఫ్యాక్టరీలకు అనుమతిచ్చారు. మహారాష్ట్రలోని ముంబై, పూణెలో ఎలాంటి సడలింపులు లేవు. ఆరెంజ్, గ్రీన్ జోన్స్‌లో పరిశ్రమలకు అనుమతి ఉంది. రాజస్తాన్‌లో నిర్మాణ రంగం, ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి మినహాయంపులు లేవు.
పశ్చిమబెంగాల్లో కోల్‌కతా, హౌరా ప్రాంతాలను రెడ్ జోన్స్‌గా ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లో బీడీ, టీ, పువ్వుల మార్కెట్స్, ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉంది. సిక్కింలో ఒక్క కరోనా వైరస్ కేస్ లేకపోవడంతో లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తేయాలని నిర్ణయించింది. ఒడిశాలో వ్యవసాయం, హార్టికల్చర్, చేపల పరిశ్రమ లాంటి వాటికి అనుమతి ఇచ్చారు. గ్రీన్జోన్లో ఉన్న ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చారు. పంజాబ్‌లో ధాన్యాల సేకరణకు మాత్రమే అనుమతి ఉంది. మధ్యప్రదేశ్‌లో రెడ్ జోన్స్ అయిన భోపాల్, ఉజ్జయిని, ఇండోర్‌లో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి లేదు. ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించాయి. గ్రీన్జోన్లో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఆరెంజ్ జోన్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించారు. చత్తీస్‌గఢ్‌లో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.