హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్.. కరోనా వాక్సిన్‌పై కీలక ప్రకటన

గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్.. కరోనా వాక్సిన్‌పై కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది.

లక్షలాది డోస్‌లను సిద్ధం చేస్తున్నామని.. సమర్థవంతమైన వాక్సిన్‌ ఈ ఏడాదే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటన చేశారు. అందరం కలిసి కరోనా వైరస్‌ను తరిమికొడతామన్నారు డొనాల్డ్ ట్రంప్.

కరోనా వాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. టీకాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరూ కోరుతున్నారు. ఇప్పటికే స్పుత్నిక్ వీ వాక్సిన్‌ను రష్యా విడుదల చేసినప్పటికీ.. దానిపైనా అనుమానాలు వ్యక్తం కావడంతో దానిపై ఎవరూ పెద్దగా ఆశలుపెట్టుకోలేదు. మరి ఏ వ్యాక్సిన్ త్వరగా వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. అమెరికాలో మూడు వాక్సిన్‌లు ఫైనల్ ట్రయల్ స్టేజిలో ఉన్నాయని.. ఇప్పటికే టీకా ఉత్పత్తిని ప్రారంభించామని వెల్లడించారు. లక్షలాది డోస్‌లను సిద్ధం చేస్తున్నామని.. సమర్థవంతమైన వాక్సిన్‌ ఈ ఏడాదే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటన చేశారు. అందరం కలిసి కరోనా వైరస్‌ను తరిమికొడతామన్నారు డొనాల్డ్ ట్రంప్.

భారత్‌లోనూ పలు వ్యాక్సిన్‌లు ట్రయల్ దశలో ఉన్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ (Covaxin), జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ (Zycov-d) వాక్సిన్‌లు రెండో దశ ట్రయల్స్ దశలో ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఆక్స్‌పర్డ్-ఆస్ట్రాజెనికా వాక్సిన్‌పై పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ వాక్సిన్ ట్రయల్స్‌తో పాటు ఉత్పత్తికి వీటి మధ్య అంగీకారం కుదిరింది. ఒకవేళ ఆక్స్‌పర్డ్ వాక్సిన్ మార్కెట్లోకి వస్తే వాటిని భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక అమెరికాలో ఇప్పటి వరకు 60,46,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాను జయించి 33,47,940 మంది కోలుకున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 184,796 మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 25,13,898 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 16,231 మంది పరిస్థితి విషమంగా ఉంది.

First published:

Tags: America, Coronavirus, Covid-19, Donald trump, USA

ఉత్తమ కథలు