పంజాబ్‌ మోడల్‌పై మోదీ ప్రశంసలు.. ఇతర రాష్ట్రాలూ అనుసరించాలి..

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ లేకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదని అన్నారు. అన్‌లాక్ 1 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని తెలిపారు.

news18-telugu
Updated: June 16, 2020, 5:35 PM IST
పంజాబ్‌ మోడల్‌పై మోదీ ప్రశంసలు.. ఇతర రాష్ట్రాలూ అనుసరించాలి..
ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా కట్టడిలో పంజాబ్ చేపట్టిన నివారణ చర్యలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లు, ఇంటింటి నిఘా వంటి కార్యక్రమాలతో మంచి ఫలితాలు సాధిస్తోందని అన్నారు. పంజాబ్ మాడల్‌ను అన్ని రాష్ట్రాలు ఫాలో కావాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం కరోనా కట్టడిపై ప్రధాని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ లేకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదని అన్నారు. అన్‌లాక్ 1 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని తెలిపారు.


మనదేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. రికవరీ రేటు కూడా 50శాతం పైనే ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. మాస్కు లేనిదే ప్రజలు బయటకు వెళ్లకూడదు. సబ్బు, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. అందరూ ఇంటి పరిసరాలను గమనించి నడుచుకోవాలి. దేశంలో పారిశ్రామిక ఉత్పాదకత మెరుగుపడింది. ఎగుమతులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. పరిశ్రమలకు తక్షణం రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లకు సూచించాం. సత్వర రుణాలిస్తే ఉత్పత్తి ప్రారంభమై ఉపాధి లభిస్తుంది. సంస్కరణలతో వ్యవసాయ రంగం వృద్ధి చెందుతోంది.
ప్రధాని మోదీ


ప్రధాని మోదీ ఇవాళ పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లద్ధాఖ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, లక్షద్వీప్, సిక్కిం, అరుణాలచ్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం సీఎంలతో మాట్లాడారు. రేపు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, ఏపీ, తెలంగాణ, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఒడిశా రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు.
First published: June 16, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading