జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. మహారాష్ట్ర కీలక నిర్ణయం

మనదేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,64,626 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా పోరాడుతూ 86,575 మంది కోలుకోగా..7,429 మంది మరణించారు.

news18-telugu
Updated: June 29, 2020, 4:02 PM IST
జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. మహారాష్ట్ర కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కేసులు భారీ మొత్తంలో బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను బట్టి ఆంక్షలను విధించాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం కాని కార్యకలాపాలను కట్టడి చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కాగా, మనదేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,64,626 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా పోరాడుతూ 86,575 మంది కోలుకోగా..7,429 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 70,607 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: June 29, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading