గుడ్‌న్యూస్.. కరోనాకు తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్..

ప్రతీకాత్మక చిత్రం (credit - twitter - reuters)

కొవాక్సిన్ (COVAXIN) అనే వాక్సిన్‌ను భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వాక్సీన్‌ను అభివృద్ధి చేసింది.

  • Share this:
    యావత్ ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు మందు లేదు. రాకుండా అడ్డుకునే వాక్సిన్ కూడా లేదు. భారత్ సహా ఎన్నో దేశాలు డ్రగ్‌తో పాటు వాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఐతే వాక్సిన్ తయారీలో భారత్ ముందడుగు వేసింది. మన దేశంలో కరోనాను ఎదుర్కొనే తొలి స్వదేశీ వాక్సీన్ తయారైంది. కొవాక్సిన్ (COVAXIN) అనే వాక్సిన్‌ను భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సీన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు గాను ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)అనుమతి ఇచ్చింది. జులైలో దేశవ్యాప్తంగా కొవాక్సిన్ ఔషద ప్రయోగాలు జరగనున్నాయి.

    మరోవైపు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మనదేశంలో ఇప్పటి వరకు 5,48,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3,21,723 మంది మంది కోలుకోగా.. 16,475 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 210,120 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
    First published: