హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

మరో సీఎంకు కరోనా పాజిటివ్.. వారంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందే..

మరో సీఎంకు కరోనా పాజిటివ్.. వారంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందే..

హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నెలకు 2 లక్షల 88 వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు.  అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నెలకు 2 లక్షల 88 వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

కర్నాటక సీఎం యడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఇప్పటికే కరోనాను జయించారు. కోవిడ్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

మన దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు కేంద్రమంత్రులు, సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్నాటక సీఎం యడ్యూరప్పకు కరోనా సోకగా.. తాజాగా హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని ట్విటర్ వేదికగా వెల్లడించారు ఖట్టర్. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకొని..కొన్ని రోజుల పాలు ఖచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.


ఇక కర్నాటక సీఎం యడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఇప్పటికే కరోనాను జయించారు. కోవిడ్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, హరియాణాలో ఇప్పటి వరకు 54,386 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44,822 మంది కోవిడ్‌ను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 603 మంది మరణించారు. ప్రస్తుతం హరియాణాలో 8,961 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

First published:

Tags: Corona virus, Coronavirus, Covid-19, Haryana

ఉత్తమ కథలు