హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా(Corona) మహమ్మారి గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దాన్ని తరిమికొట్టేందుకు ప్రపంచమంతా ఏకమైనా, రూపాలు మార్చుకుంటూ మానవాళిపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో నాలుగో వేవ్ (Third Wave) కూడా నడుస్తోంది. మన దేశంలో సెకండ్ వేవ్ ముగిసిపోయే దశలో ఉండగా.. మూడో వేవ్ కూడా రానుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

కరోనా(Corona) మహమ్మారి గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దాన్ని తరిమికొట్టేందుకు ప్రపంచమంతా ఏకమైనా, రూపాలు మార్చుకుంటూ మానవాళిపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో నాలుగో వేవ్ (Fourth Wave) కూడా నడుస్తోంది. మన దేశంలో సెకండ్ వేవ్ ముగిసిపోయే దశలో ఉండగా.. మూడో వేవ్ కూడా రానుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే సార్స్ కోవ్- 2 వైరస్ గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతోందని చెబుతోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్). కరోనా వైరస్‌ సోకిన గర్భిణుల్లో ఇన్‌ఫెక్షన్‌ మధ్యస్థం నుంచి తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉందని సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేల్చింది. ఇతరులతో పోలిస్తే వీరికి కోవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ స్టడీ వెల్లడించింది.

Vaccination Effects: కరోనా టీకాతో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..


కోవిడ్- 19 ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణీలలో వచ్చే సమస్యలపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 4203 మంది గర్భిణీల డేటాను తీసుకొని, వాళ్ల కేసులను స్టడీ చేసింది. అందులో 13 శాతం మంది.. అంటే 534 మందిలో రోగ లక్షణాలు కనిపించాయి. అందులో 384 మందికి తక్కువగా లక్షణాలు కనిపించగా.. 112 మందికి మధ్యస్థంగా లక్షణాలు కనిపించాయి. మిగిలిన 40 మందికి రోగ లక్షణాలు అధికంగా ఉన్నట్టు ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. 4203 మంది గర్భిణీలలో 77 మందికి గర్భస్రావం అయింది.

Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


3203 మంది పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. 834 మందికి మాత్రం నార్మల్ డెలివరీ కాలేదు. అంటే కరోనా వైరస్ వల్ల గర్భిణీలలో వచ్చే సమస్యలు 6 శాతంగా ఉన్నాయి. అందులో ప్రీటర్మ్ డెలివరీ అనేది చాలా ప్రమాదకరంగా ఉందని రీసెర్చ్ లో వెల్లడి అయింది. 528 మందికి ప్రీటర్మ్ డెలివరీ కాగా.. గర్భిణీగా ఉన్న సమయంలో 328 మంది హైపర్ టెన్సివ్ డిజార్డర్ కు గురయినట్టు అధ్యయనం స్పష్టం చేసింది.

Covid 19: కోవిడ్‌తో తీవ్ర కిడ్నీ సమస్యలు.. అధ్యయనంలో సంచలన నిజాలు.. హెచ్చరిస్తున్న వైద్యులు..


అందులో 34 మంది గర్భిణీగా ఉన్నప్పుడు, డెలివరీ అయ్యాక కోవిడ్ బారిన పడి మరణించారని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే.. కోవిడ్ వచ్చిన గర్భిణీలకు వెంటనే హాస్పిటల్ లో సరైన ట్రీట్ మెంట్ అందించాలని ఐసీఎంఆర్ వెల్లడించింది.

Published by:Veera Babu
First published:

Tags: Corona, ICMR, New Guidelines

ఉత్తమ కథలు