భారతీయులకు గుడ్‌న్యూస్..అమెరికా గ్రీన్ కార్డు వీళ్లకు ఇక సులభం...ఎవరికంటే...

ఒక వేళ ఈ బిల్లు గనుక చట్టరూపం దాలిస్తే హెచ్1బి, లేదా జె2 వీసాలు కలిగి ఉన్న వేలాది మంది భారతీయ నర్సులు, డాక్టర్లకు ప్రయోజనం కలుగుతుంది.

news18-telugu
Updated: May 10, 2020, 6:56 AM IST
భారతీయులకు గుడ్‌న్యూస్..అమెరికా గ్రీన్ కార్డు వీళ్లకు ఇక సులభం...ఎవరికంటే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)
  • Share this:
అమెరికాలో కోవిడ్19 కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య రంగం సత్వర అవసరాలను తీర్చడం కోసం వేలాది మంది విదేశీ డాక్టర్లు, నర్సులకు ఉపయోగించకుండా ఉన్న గ్రీన్‌కార్డులను ఇవ్వడం లేదా శాశ్వత చట్టపరమైన నివాస హోదా కల్పించాలని కోరుతూ పలువురు అమెరికా శాసనకర్తలు కాంగ్రెస్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్ రెసిలియన్స్ యాక్ట్‌గా పిలవబడే ఈ బిల్లు గనుక అమోదం పొందితే గతంలో చాలా సంవత్సరాలుగా అమెరికా కాంగ్రెస్ ఆమోదించి, ఉపయోగించకుండా ఉన్న వేలాది గ్రీన్‌కార్డులను తిరిగి దక్కించుకోవడానికి, తద్వారా అదనంగా వేలాది మంది వైద్య నిపుణులు శాశ్వతంగా అమెరికాలో సేవలు అందించడానికి వీలవుతుంది. ఈ చట్టం వల్ల 25 వేలకు పైగా నర్సులు, దాదాపు 15 వేల మంది డాక్టర్లకు గ్రీన్‌కార్డులు లభిస్తాయి.

ఒక వేళ ఈ బిల్లు గనుక చట్టరూపం దాలిస్తే హెచ్1బి, లేదా జె2 వీసాలు కలిగి ఉన్న వేలాది మంది భారతీయ నర్సులు, డాక్టర్లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతినిధుల సభలో ఈ బిల్లును అబీ ఫింకినార్, బ్రాడ్ ష్నీడర్, టామ్‌కోల్, డాన్ బేకన్‌లు ప్రవేశపెట్టగా సెనేట్‌లో సెనేటర్లు డేవిడ్ పెర్డూ, డిక్ డర్బిన్, టాడ్ యంగ్, క్రిస్ కూన్‌లు ప్రవేశపెట్టారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. వైరస్ దానంతట అది అం తర్ధానమై పోదు. అయితే అమెరికాను వైద్య నిపుణల కొరత వేధిస్తోంది అని బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రతినిధుల్లో ఒకరైన అబీ ఫింకినార్ అంటున్నారు. చాలా వైద్య సంస్థలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి.
Published by: Krishna Adithya
First published: May 10, 2020, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading