Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS JABARDASTH HYPER AADI REQUEST PEOPLE NOT TO COME OUTSIDE SK

హైపర్ ఆది విజ్ఞప్తి.. ఏ సాయం కావాలన్నా ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. వీరిలో 145 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 29 మంది చనిపోయారు.

    కరోనాకు మందులేదు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. ఈ మాటలను ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రాకూడదని.. సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనాపై ప్రభుత్వాు చేస్తున్న ఈ పోరాటంలో సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు సైతం పాలుపంచుకుంటున్నారు. కొందరు సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటే.. మరికొందరు ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు పాటలు పాడి.. స్కిట్‌లు చేసి.. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ట్విటర్ పేజీ ద్వారా సెలబ్రిటీలతో కరోనా సందేశం ప్రజల్లోకి పంపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఆది ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉండి.. మనల్ని, కుటుంబాలను, దేశాన్ని కాపాడుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు. ఏ అవసరం కావాలన్నా.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

    బయట కాలు పెట్టకుండా ఇంట్లోనే ఉండడం ఇబ్బందిగా ఉంది కదా.! ఇబ్బందిగా ఉన్న పర్లేదు. మనం బయటకొస్తేనే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంట్లోనే ఉండి మనల్ని మనం కాపాడుకుందాం. దేశాన్ని కూడా కాపాడుకుందాం. మన కోసం డాక్టర్లు, పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు. వీరిందరికీ సహకరిద్దాం. కరోనాపై ఎటువంటి సాయం కావాలన్నా 8297 104 104కి వాట్సాప్ చెయ్యండి.
    హైపర్ ఆది


    ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు 27, అనంతపురం 4, తూర్పు గోదావరి 2, గుంటూరు 11, కృష్ణా 14, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకుని ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. వీరిలో 145 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 781గా ఉంది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకు 29 మంది చనిపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Coronavirus, Covid-19, Hyper Aadi, Jabardasth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు