Covid-19 Deaths | కరోనా మరణ మృదంగం...ప్రతి గంటకు 247 మంది మృతి

Global Coronavirus Deaths | ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7 లక్షలు దాటగా...అమెరికా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో దేశాల్లో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి.

news18-telugu
Updated: August 5, 2020, 9:19 PM IST
Covid-19 Deaths | కరోనా మరణ మృదంగం...ప్రతి గంటకు 247 మంది మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్...గత కొన్ని మాసాలుగా యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బుధవారంనాటికి కరోనా మరణాల సంఖ్య 7 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు ప్రపంచంలో కరోనా మరణాలు 7,04,365కు చేరింది. అమెరికా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో దేశాల్లో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా గత రెండు వారాలుగా నమోదవుతున్న కరోనా మరణాలను పరిగణలోకి తీసుకుంటే...నిత్యం సరాసరిగా దాదాపు 5,900 మంది కరోనా కాటుకు బలవుతున్నారు. అంటే ప్రతి గంటకూ 247 మంది కరోనాతో పోరాడి తనువుచాలిస్తున్నారు. లేదా ప్రతి 15 నిమిషాలకు ఓ కరోనా రోగి ప్రాణం గాల్లో కలిసిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ - రాయిటర్స్ విశ్లేషించింది.

Global Coronavirus Deaths, covid19 heaths, covid19 updates, covid19 latest updates, corona deaths total, corona deaths india, కరోనా మరణాలు, కరోనా గంటకు మరణాలు, కోవిడ్ మరణాల సంఖ్య
ప్రతీకాత్మక చిత్రం


అమెరికాలో కోవిడ్-19 మరణాల సంఖ్య 1,60,000కు చేరుకుంది. అయితే కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం వాస్తవమేనని అంగీకరించారు. అయితే కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేయాల్సిందల్లా చేస్తోందని...ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి ప్లేగ్ కంటే ప్రమాదకరమని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

కోవిడ్ మరణాల సంఖ్య పరంగా బ్రెజిల్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 96 వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. మెక్సికో(49 వేలు), బ్రిటన్(46 వేలు), భారత్(40 వేలు), ఫ్రాన్స్(30 వేలు), స్పెయిన్(29 వేలు)లోనూ భారీగా కరోనా మరణాలు సంభవించాయి.

Global Coronavirus Deaths, covid19 heaths, covid19 updates, covid19 latest updates, corona deaths total, corona deaths india, కరోనా మరణాలు, కరోనా గంటకు మరణాలు, కోవిడ్ మరణాల సంఖ్య
ప్రతీకాత్మక చిత్రం


కరోనా కేసులు తక్కువగా ఉన్న దేశాల్లోనూ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సరాసరిగా కరోనా మరణాల రేటు 3.77 శాతంగా ఉండగా...ఇది అమెరికాలో 3.26 శాతం, బ్రెజిల్‌లో 3.42 శాతం, భారత్‌లో 2.09 శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక మరణాల రేటు ఫ్రాన్స్(15.75 శాతం, బ్రిటన్(15.12 శాతం), ఇటలీ (14.16శాతం), మెక్సికో(10.86 శాతం)లో నమోదవుతున్నాయి.ఆస్ట్రేలియా, జపాన్, హాంకాంగ్, బొలీవియా, సూడాన్, ఇతోపియా, బల్గేరియా, బెల్జియం, ఉజ్బెకిస్థాన్, ఇజ్రాయిల్ తదితర దేశాల్లో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Published by: Janardhan V
First published: August 5, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading