కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతోంది. ఆమె ఓ దేశానికి యువరాణి. నిత్యం అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలోనే ఉంటారు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాల్సిన పనేలేదు. కానీ అలాంటి యువరాణికి సైతం కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన స్పెయిన్‌లో జరిగింది. స్పెయిన్ యువరాణి మరియా థెరిసా(86) కరోనా వైరస్ సోకడంతో మరణించినట్టు ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్నిక్ డి బోర్బన్ ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించాడు. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. రాజ కుటుంబానికి చెందిన యువరాణి కరోనా వైరస్ బారిన పడి మరణించిందంటే తమలాంటి పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినా.. అనేకమంది తరచూ రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు యువరాణి మరణ వార్త అయిన కనువిప్పు కలిగిస్తుందేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Spain