మనమే బెటర్.. భారత్‌లో కరోనా మరణాలు తక్కువే

ఇప్పటివరకు దేశంలో 95,527 మంది డిశ్చార్జి అయ్యారన్న లవ్ అగర్వాల్.. రికవరీ రేటు 48.07 శాతం ఉందని వెల్లడించారు. కరోనా మృతుల్లో 73 శాతం మందికి ఇతర రుగ్మతలూ ఉన్నాయని ఆయన చెప్పారు.

news18-telugu
Updated: June 2, 2020, 6:13 PM IST
మనమే బెటర్.. భారత్‌లో కరోనా మరణాలు తక్కువే
దేశంలో కరోనా విశ్వరూపం... (credit - NIAID)
  • Share this:
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు 8వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఐతే కేసులు పెరుగుతున్నాయని ఆందోళన అవసరం లేదని కేంద్రం తెలిపింది. మనదేశంలో కరోనా మరణాల రేటు 2.82 శాతంగానే ఉందని.. ప్రపంచ మరణాల రేటు 6.13 కన్నా మనం మెరుగైన స్థితిలోనే ఉన్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉందని ఆయన చెప్పారు.


ఇప్పటివరకు దేశంలో 95,527 మంది డిశ్చార్జి అయ్యారన్న లవ్ అగర్వాల్.. రికవరీ రేటు 48.07 శాతం ఉందని వెల్లడించారు. కరోనా మృతుల్లో 73 శాతం మందికి ఇతర రుగ్మతలూ ఉన్నాయని ఆయన చెప్పారు. కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా సోకితేనే ప్రమాదమని.. ఇతర ఏ రోగాలు లేని వారు కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారను.

ఇక, ప్రస్తుతం దేశంలో రోజూ లక్షా 20 వేల టెస్టులు చేస్తున్నామని ICMR అధికారిణి నివేదిత గుప్తా తెలిపారు. దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లాల్లో పరీక్షలు వేగవంతం చేస్తే కరోనా పరీక్షల సంఖ్య ఇంకా పెరుగుతుందని వెల్లడించారు. మన దేశంలో కరోనా పరీక్షల కోసం 681 లేబొరేటరీలు ఉన్నాయన్న ఆమె.. ఇందులో 476 ప్రభుత్వ, 205 ప్రైవేటుకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు నివేదిత గుప్తా.


కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 1,98,706 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 93,323 ఉండగా, 91,818 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, 5,394 మంది వ్యాధితో మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ఆ తర్వాత తమిళనాడు(23,495), ఢిల్లీ(20,834), గుజరాత్(17,200) ఉన్నాయి.

First published: June 2, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading