భారత్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. తొలిసారి 26వేలకు పైగా

భారత్‌లో కొత్తగా 26,506 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 19,135 మంది డిశ్చార్జి అవగా.. మరో 475 మంది మరణించారు.

news18-telugu
Updated: July 10, 2020, 10:06 AM IST
భారత్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. తొలిసారి 26వేలకు పైగా
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
భారత్‌లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా 26,506 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 19,135 మంది డిశ్చార్జి అవగా.. మరో 475 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారి నుంచి 4,95,512 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 21,604 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 2,76,685 యాక్టివ్ కేసులున్నాయి.

రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు:

రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు
Published by: Shiva Kumar Addula
First published: July 10, 2020, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading