దేశంలో దారుణంగా కరోనా .. రెండు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు..

విజృంభిస్తున్న కరోనా (credit - NIAID)

దేశంలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 8392 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి.

 • Share this:
  దేశంలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 8392 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువగా వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 1,98,706 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 93,323 ఉండగా, 91,818 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, 5,394 మంది వ్యాధితో మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ఆ తర్వాత తమిళనాడు(23,495), ఢిల్లీ(20,834), గుజరాత్(17,200) ఉన్నాయి.
  దేశంలో కరోనా వివరాలు..


  ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. సోమవారం 94 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,792కి చేరింది. వీరిలో 434 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. ఏపీలో నిన్న ఉదయం 9 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3118గా ఉంది. అందులో 2169 మంది డిశ్చార్జి అయ్యారు. 64 మంది చనిపోయారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: