సెక్స్ వర్కర్స్ పాలిట శాపంగా కరోనా.. తిండి లేక..

కరోనా వాళ్ల పాలిట శాపంగా మారింది.. ఇన్నాళ్లు కడుపు నిండా తిన్న వాళ్లు.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెక్స్ వర్కర్లకు స్వర్గధామమైన థాయిలాండ్‌లో వ్యభిచారిణుల పరిస్థితి ఇదీ.

news18-telugu
Updated: April 6, 2020, 10:11 AM IST
సెక్స్ వర్కర్స్ పాలిట శాపంగా కరోనా.. తిండి లేక..
నమూనా చిత్రం
  • Share this:
కరోనా వాళ్ల పాలిట శాపంగా మారింది.. ఇన్నాళ్లు కడుపు నిండా తిన్న వాళ్లు.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెక్స్ వర్కర్లకు స్వర్గధామమైన థాయిలాండ్‌లో వ్యభిచారిణుల పరిస్థితి ఇదీ. కరోనా దెబ్బకు ఒకరిద్దరు కాదు.. దాదాపు 3 లక్షల మంది రోడ్డున పడ్డారు. బ్యాంకాక్, పట్టయా ప్రాంతాల్లో పడుపు వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న వాళ్లనిప్పుడు కరోనా కాటేసింది. బ్యాంకాక్‌లో ఉండే సెక్స్ వర్కర్లు బార్లలో టిప్స్ కోసం పనిచేసేవాళ్లు. అక్కడికి వచ్చే కస్టమర్లతో మాట్లాడుకొని ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేసేవాళ్లు. అయితే, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాటన్నింటికీ అక్కడి ప్రభుత్వం చెక్ పెట్టింది. దీంతో సెక్స్ వర్కర్లంతా పని లేకుండా, చేతిలో పైసల్లేకుండా తయారయ్యారు.

సెక్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. భారత్‌లోనూ చాలా మంది వ్యభిచారం చేసుకుంటూ పొట్టపోసుకునేవాళ్లే. కోల్‌కతాలో ఓ ప్రాంతంలో ఇలాగే నడుస్తోంది. అయితే, కరోనా దెబ్బకు ఆ ప్రాంతం వెలవెలబోతోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం థాయిలాండ్‌లో 2వేల మందికి వైరస్ సోకగా, 20 మంది చనిపోయారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు 24 గంటల కర్ఫ్యూ పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమని ప్రకటించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 6, 2020, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading