బ్రీత్ ఎనలైజర్లకు బ్రేక్ ఇవ్వండి బాబోయ్.. హైదరాబాదీల డిమాండ్

బ్రీత్ ఎనలైజర్ మిషన్‌ ద్వారా కూడా ఇలాంటి వైరస్‌లు ఒకరి నుంచి మరోకరికి వ్యాపించే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు. దాంతో నగరంలోని చాలా మంది ఆయన వాదనను సమర్థిస్తున్నారు.


Updated: February 4, 2020, 11:01 PM IST
బ్రీత్ ఎనలైజర్లకు బ్రేక్ ఇవ్వండి బాబోయ్.. హైదరాబాదీల డిమాండ్
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తూ యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనావైరస్ ప్రభావంతో చైనాలో ఇప్పటికే 500 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మన దేశంలో ఇప్పటి వరకు ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో కరోనా అనుమానిత కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరవాసుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని వాపోతున్నారు. ఈ క్రమంలో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికే వాదా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సురేశ్ రాజు నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. నగరంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. అందులో వాడే బ్రీత్ ఎనలైజర్ మిషన్‌ ద్వారా కూడా ఇలాంటి వైరస్‌లు ఒకరి నుంచి మరోకరికి వ్యాపించే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు. దాంతో నగరంలోని చాలా మంది ఆయన వాదనను సమర్థిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 50 అనుమానిత కరోనా కేసులు నమోదయినట్లు సమాచారం. ఐతే ఏ ఒక్కరిలోనూ పాజిటివ్ రాలేదు. కేవలం ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. అనంతరం కరోనా వైరస్ లేదని డాక్టర్లు నిర్ధారించడంతో డిశ్చార్జ్ అయ్యారు. మరికొందరు మాత్రం అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఇక కరోనా వైరస్ అనుమానితుల కోసం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక వైద్య పరికరాలను కూడా తెప్పించారు. విదేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులను పరీక్షించడంతో పాటు వైరస్ అనుమానిత వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: February 4, 2020, 10:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading