Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS HYDERABAD IS SAFER THAN MUMBAI CHENNAI SAYS CP ANJANI KUMAR SK

కరోనా కేసులను చూసి హైదరాబాద్ ప్రజలు భయపడవద్దు: సీపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ నగర ప్రజలకు సీపీ అంజనీ కుమార్ కీలక విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న కరోనా కేసులను చూసి ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని సూచించారు.

    తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కేసులను నుంచి నగరవాసుల్లో ఆందోళన మొదలయింది. దీనికి తోడు మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారంతో చాలా మంది పల్లె బాట పట్టారు. ఇక్కడే రిస్క్‌లో పడతామని.. ఊర్లలకు వెళ్తే క్షేమంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర ప్రజలకు సీపీ అంజనీ కుమార్ కీలక విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న కరోనా కేసులను చూసి ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని సూచించారు.

    హైదరాబాద్ సిటీ ఎంతో సురక్షితమైంది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో కోవిడ్ మరణాల సంఖ్య స్వల్పంగానే ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు తమ కర్తవ్యం నిర్వర్తించారు. ప్రజా శ్రేయస్సు విషయంలో పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉన్నారు.
    అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ


    కాగా, గురువారం తెలంగానలో 1,213మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో హైదరాబాద్‌లోనే 998 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 9,069 మంది డిశ్చార్జి కాగా.. 275 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గురువారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో తెలంగాణలో ఇప్పటి వరకు 98,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు